సబ్సిడీ ద్వారా విత్తనాలు పంపిణీ

0
TMedia (Telugu News) :

సబ్సిడీ ద్వారా విత్తనాలు పంపిణీ
-అగ్రికల్చేర్ అధికారి (ఏవో) పూడి పవిత్ర

s s consultancy
  • గిరిజనులకు 90 శాతం సబ్సిడీ కాగా, గిరిజనేతరులుకు 15 శాతం సబ్సిడీ తో అందించనున్నారు.
    వి.అర్.పురం13;- ప్రభుత్వం సకాలంలో రైతులకు వరి విత్తనాలను అందించాలనే ఉద్దేశ్యంతో నేటి నుండి వరి విత్తనాలను గిరిజన రైతులు కు సబ్సీడీ ద్వారా 90 శాతం సబ్సీడీ తో గిరిజనేతరులుకు 15 శాతం సబ్సిడీతో విత్తనాలను అందజేయడం జరుగుతోందని అగ్రికల్చేర్ ఏవో పూడి పవిత్ర ఒక ప్రకటనలో తెలియ పర్చారు. ఇందులో రెండు రకాల విత్తనాలను అందిస్తున్నట్లు తెలిపారు. అందులో మొదటి రకం “యం టి యు 1121 వరిరకం 30 కేజీలు బస్తా అసలు ధర 1134.3 రూపాయలు కాగా , అందులో సబ్సిడీ1020.87 పైసలు, అయితే గిరిజన రైతు కట్టాల్సిన 113.43 పైసలు. అదే విధంగా రెండో రకం విత్తనాలు బిపిటి 5204 రకం 25 కేజీలు అసలు ధర 952.5 పైసలు కాగా గిరిజనులకు రాయితీ ధర 857.25 ఇవ్వగా 90 శాతం తో రూ. 95.25 రూపాయలు కట్టాలి. ఇది ఇలా ఉండగా గిరిజనేతరులుకు 15 శాతం సబ్సిడీ ఉంటదని తెలిపారు. పైన తెలిపిన రెండు వారి రకాలలో అసలు ధర కంటే కేజీ కి రూ 5 తగ్గించి ఇవ్వడం జరుగుతోందని పేర్కొన్నారు. రైతులు సకాలంలో స్పందించి ఈ విత్తనాలను తీసుకోవాలని కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.