చిరంజీవి ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఆక్సిజన్ ను అందిస్తున్న బ్యాంక్ ను సందర్షించిన ఆర్జేసీ కృష్ణ

0
TMedia (Telugu News) :

చిరంజీవి ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఆక్సిజన్ ను అందిస్తున్న బ్యాంక్ ను సందర్షించిన ఆర్జేసీ కృష్ణ
———–//////——^^^—
కరోనా వ్యాధి నేపధ్యంలో ఆక్సిజన్ కొరత గుర్తించి, చలించి ప్రభుత్వంతో పాటు వ్యక్తిగతంగా ముందుకు వచ్చి ఖమ్మం జిల్లా కేంద్రంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ బ్యాంక్ ను టీఆరెస్ పార్టీ జిల్లా కార్యాలయ ఇంచార్జ్, ఎస్.బి.ఐ. టి.,ఆర్జేసీ విద్యా సంస్థల అధినేత శుక్రవారం సందర్షించి పేద ప్రజల కోసం ఆక్సిజన్ బ్యా0క్ ఏర్పాటు చేయడం పట్ల ఆయనకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఇప్పటికే చిరంజీవి చారిటబుల్ ట్రస్టు ద్వారా రక్తదానం,నేత్రదానం తదితర సేవాకార్యక్రమాలు చేపడుతున్న చిరంజీవి ప్రజల కోసం నేనున్నానంటూ కాపు కాచేలా ప్రాణ వాయువు బ్యాంకు ఏర్పాటు చేయడం ఆయన సేవానిరతికి నిదర్శనమన్నారు.రాష్ట్ర మంత్రి,ఖమ్మం ఎం.ఎల్.ఏ.పువ్వాడ అజయ్ కుమార్ తో ఆయనకు ఉన్న సంబంధాలతో తెలంగాణా రాష్ట్రంలో నే మొదటి సారి ఖమ్మం లో ఈ సేవాకార్యక్రమాన్ని ప్రారంభించడం పట్ల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవు తున్నాయన్నారు.అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా దీనిని ఏర్పాటు చేయాలను కుంటున్నట్లు తెలిసిందని,పేద,మధ్యతరగతి ప్రజలకు ఈ సౌకర్యం అందేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ విషయంలో తమ పూర్తి సహాయ, సహకారాలు ఉంటాయని తెలిపారు.ఈకార్యక్రమంలో కార్పొరేటర్ రాపర్తి శరత్,చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ బాద్యులు గుండాల వీరేశ్,ఎం.డి.సాధిక్ అలీ,గంగిశెట్టి శ్రీను,టిఆర్ఎస్ నాయకులు మాటేటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు…

s s consultancy
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.