అంతర్ రాష్ట్ర సరిహద్దును తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

0
TMedia (Telugu News) :

అంతర్ రాష్ట్ర సరిహద్దును తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

s s consultancy

టి-మీడియా (మే27) కర్నూలు జిల్లా

కర్ప్యూ సమయంలో పోలీసులు పకడ్బందీగా విధులు నిర్వహించాలి.
కరోనా కట్టడి కి కర్ప్యూను పటిష్టంగా అమలు చేయాలి.
వాహనాల రాక, పోకలు లేకుండా నియంత్రించాలి.
కర్ప్యూ సమయంలో గూడ్స్ (నిత్యవసర), అత్యవసర వాహనాలను మాత్రమే అనుమతించాలి.
కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వారాల పాటు మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి దినం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటున్న నేపథ్యంలో గురువారం అంతరాష్ట్ర సరిహద్దులో ఉన్న సుంకేశుల చెక్ పోస్టును జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ ఆకస్మిక తనిఖీ చేసి కర్ఫ్యూ ఆంక్షల అమలును గురువారం పరిశీలించారు.
అనంతరం తెలంగాణ పోలీసులతో జిల్లా ఎస్పీ మాట్లాడారు.
ఈ – పాస్ ఉన్న వారిని అనుమతించాలన్నారు.
జిల్లా సరిహద్దు చెక్ పోస్టులలో అనుమతుల మేరకే అత్యవసర వాహనాలను అనుమతించాలన్నారు. ఇతర వాహనాలను అనుమతించారాదన్నారు.
అనవసరంగా ప్రజలు బయట తిరగకుండా పోలీస్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
కర్ఫ్యూ వేళల్లో సిబ్బంది చేపట్టాల్సిన పకడ్బందీ చర్యలపై దిశానిర్ధేశం చేశారు.
ప్రజా రవాణా మాత్రం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నాం 12 గంటల వరకు మాత్రమే అనుమతించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు కర్నూలు పట్టణ డిఎస్పీ కె వి మహేష్ , కోడుమూరు సిఐ శ్రీధర్ , గూడురు ఎస్సై నాగార్జున, గూడురు పి ఎస్ ఐ మమత ఉన్నారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.