ఫీవర్ సర్వే వివరాలను అడిగి తెలుసుకుంటున్న జిల్లా వైద్యాధికారి

0
TMedia (Telugu News) :
s s consultancy

ఫీవర్ సర్వే వివరాలను అడిగి తెలుసుకుంటున్న జిల్లా వైద్యాధికారి

టీ మీడియా అచ్చంపేట, మే 25: రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ రాకుండా ముందు జాగ్రత్త చర్యగా ఆరోగ్య సిబ్బంది తో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫీవర్ సర్వే చేస్తున్నారు. అందులో భాగంగా
అచ్చంపేట మండల పరిదిలోని రంగపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న ఫీవర్ సర్వే వివరాలను మంగళవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. కె. సుధాకర్ లాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వే బృందాలు, ఫీవర్ సర్వే నిర్వహించిన కుటుంబాలను కలిసి సర్వే బృందాలు నిర్వహించిన సర్వే వివరాల ప్రకారంగా వివరాలు అందించిన కుటుంబాల ను కలిసి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరికయినా, దగ్గు, జ్వరం, శ్వాస పీల్చుకోవడం లాంటి ఇబ్బందులు వస్తే వైద్య సిబ్బందిని సంప్రదించాలని, ఆయన అన్నారు. వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది సిద్ధంగా ఉన్నామని ఆయన వారికి వివరించారు. కోవిడ్ సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తున్న వేల కోవిడ్-19 వైరస్ నియంత్రించాలంటే వైద్యులు చెప్తున్న సూచనలు, సలహాలు, పాటించి బయటికి రాకుండా ఇళ్లల్లో కూడా మాస్కులు ధరించి సామాజిక దూరంతో స్వీయ నియంత్రణ పాటించి కోవిడ్ వైరస్ ను పారద్రోలడానికి గ్రామ ప్రజలంతా సహకరించాలని ఆయన విజ్ఞప్తిచేశారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు, డా. శ్రీకాంత్ ఆశా వర్కర్లు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.