మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు.

0
TMedia (Telugu News) :
s s consultancy

మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు.

టీ మీడియా న్యూస్, జూలై 2, మధిర: మధిర మండలంలో హరితహారం కార్యక్రమం లో భాగంగా శనివారం ఉదయం పర్యటించనున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటన ఏర్పాట్లను శుక్రవారం జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. రెండో వార్డులో ఎంప్లాయిస్ కాలనీ కి వెళ్లే రోడ్డు కి ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం మంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఆ ఏర్పాట్లను జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పరిశీలించారు. వారి వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు టిఆర్ఎస్ జిల్లా నాయకులు మొండితోక జయకర్, రెండో వార్డు కౌన్సిలర్ ఇక్బాల్ టిఆర్ఎస్ నాయకులు ప్రసాద్ రవి, కురేష్ తదితరులు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.