కరోనా వాక్సిన్ విజయవంతముగా కొనసాగించండి

0
TMedia (Telugu News) :
s s consultancy

కరోనా వాక్సిన్ విజయవంతముగా కొనసాగించండి
డాక్టర్స్ కు టీమ్ జిల్లా వైద్యాధికారి మాలతీ సూచనలు

టీ మీడియా,జూన్ 18,మధిర:
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారినణి డాక్టర్ మాలతీ శుక్రవారం సాయంత్రం ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ బనిగండ్లపాడు విజిట్ లో భాగంగా తిరుగు ప్రయాణంలో మధిర సివిల్ హాస్పిటల్ సందర్శించి సివిల్ హాస్పిటల్ వైద్యులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్బంగా మాలతి మాట్లాడుతూ…. కరోనా వాక్సిన్ విజయవంతంగా కొన సాగించాలి అని ప్రస్తుతం వర్షాలు కురిసే సీజన్ కనుక ప్రతి వైద్యడు వైద్యురాలు సీజనల్ వ్యాదుల పై అప్రమత్తంగా ఉండాలి. కరోనా వార్డ్ సేవలు నిరంతరం కొనసాగాలి అని హాస్పిటల్ లో మాత శిశువు సేవలు 100%టార్గెట్ లు పూర్తి చేయాలి అని వివరించారు. అనంతరం సిపిఎస్ హైస్కూల్లో కొన సాగుతున్న కరోనా వ్యాక్సిన్ సెంటర్స్ పరిశీలించినారు. హాస్పిటల్ డెలివరీ లు గురించి డాక్టర్ మనోరమను వివరాలు అడిగి తెలుసు కున్నారు. ప్రతి ఆరోగ్యసిబ్బంది సమగ్ర ఆరోగ్యసేవలు అందించాలీ అని డాక్టర్ మాలతీ తెలియపరిచినారు. ఈ కార్యక్రమం లో డాక్టర్ కనకపూడి అనిల్ కుమార్,డాక్టర్ శ్రీనివాస్ మిగతా ఆరోగ్యసిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.