విశ్వచైతన్య బాగోతం బైటపెట్టిన పోలీస్ కు షెల్యూట్ —

0
TMedia (Telugu News) :

విశ్వచైతన్య 50 ప్లేస్ వయస్సు..తనకున్న తెలివి తేటలతో సమాజం కు మేలు చేస్తూ అందులో ఒకడైన అతను అతను బ్రతకాలి.అందుకు విరుద్ధం గా ఆధ్యాత్మికం ముసుగు లో అడ్డగోలు వ్యాపారం,అసాంఫిక కార్యకలాపాలు కు తెర లేపిన చైతన్య బృందము అతకట్టించిన పోలీస్ కు ప్రతి ఒక్కరు షెల్యూట్ చేయాలి..ఆ టాస్క్ ఫోర్స్ బృందం లో మహిళ కానిస్టేబుల్ కూడా ఉంది.ఆ తల్లికి వందనాలు చెపుతున్న.ఐజీ రంగానాద్ గారు ఖమ్మం లో ఎస్పీ గా ఉన్నపుడు ఇటువంటి వారి ఆట కట్టించారు..వారి విధులు వారు నిక్కచ్చిగా నిర్వహించారు.అదొక భాగం.

డబ్బు ఉన్న వారిలో,లేని వారిలోను తర ,తమ స్థాయిలో చాలా మందిలో నూన్యత భావం పెరిగి అది వివిధ రకాల ఆధ్యాత్మికత వైపు భిన్న మైన విశ్వసాలు, సాంప్రదాయాలు వైపు మరు లు తోంది…ఈ పరిస్థితి ని జాగ్రత్తగా గమనిస్తున్నకొంతమంది ,మాటల మాంత్రికులు గా మారి.సెల్ఫ్ నెట్ వర్క్ ఏర్పాటు చేసుకొని. జనాన్ని తమవైపుతిప్పుకొంటున్నారు.వ్యక్తి పూజాతత్వం అనే విధానం అమలు జరపడం ద్వారా కోట్లు కొల్ల గొడుతున్నారు.. జల్సా రాయుళ్ళు గా మారుతున్నారు..వారి కి చెందిన సింహద్వారం వద్ద ఉండే చెప్పులు పెట్టుకొనే దెగ్గర నుండి వారి వ్యాపార దోపిడీ ప్రారంభిస్తున్నారు.అటువంటి కోవకు చెందిన వాడు ఈ విశ్వచైతన్య.ప్రవచనం లు చెపుతాడు అంటారు.

వచనం అంటేవ్యాఖ్యానం…..ప్రవ* అంటే పెద్దల మాటలు..పెద్దల నోటి వెంబడి వచ్చే మాటలు చాలా అనుభవం తో కూడుకొన్నవి అన్న జనం * లోని విశ్వాసాన్ని చైతన్య తనకు అనుకూలంగా మార్చుకొన్నాడు ..*

s s consultancy

తనకు తానే పెద్ద వాడిగా ప్రచారం చేసుకొన్నాడు..అందుకు షోషల్ మీడియా ని (యూట్యూబ్ చానల్)వేదిక గా మార్చుకొన్నాడు.పోలీస్ వారు చెప్పిన ప్రకారం 40 దేశాల్లో భక్తులు ను సంపాదించాడు..అంటే ఎంత మూఢత్వం లోకి జనం పోతున్నారు ఆలోచించుకోవాలి..పెద్దల వ్యాఖ్యలు కావాలి అనుకొన్న వారు..కాస్త ఓపిక చేసి.మన ఇల్లు, ప్రక్క ఇల్లు,మన బజారు,ప్రక్క బజారు కు వెళ్లివెతుక్కొని పెద్దల వద్దకు వెళ్లి మంచి మాటలు చెప్పమని అడగండి..అనుభవాలు వివరించమనండి.చేత నైతే పళ్ళు,ఇతరత్రా వారికి తీసుకెళ్లి ఇవ్వండి..చైతన్య ,అతని లాంటి వారు చెప్పే వాటి కంటే గొప్ప విషయాలు వివరిస్తారు. ఖర్చు లేని ఇటువంటి పనులు వదిలేసి పెద్ద మొత్తంలో వెచ్చించాల్సిన ఫ్యాషన్ డిజైన్ వైపు మాత్రమే మొగ్గు చూపుతుతుంటే దొంగ బాబాలు పుట్టుకు వస్తూనే ఉంటారు. నేను సాంప్రదాలను గౌర విస్త.ఇంట్లో దేముడు తో పాటు 40 ఏళ్ల క్రితం మాకు దూరం అయిన అక్క చిత్ర పటానికి,13 ఏళ్ల క్రితం దూరం అయిన నాన్న పటానికి దడం పెట్టుకొంటా..బైటకు వెళితే అన్ని మతాల ప్రార్ధన మందిరాలు వద్ద అగుతా ఇది నా వ్యక్తి గతం.

నేను చెప్పేది ఏంటి అంటే పోలీస్ శాఖ ఒక పయత్నం చేసింది..వారికి ఇది ఒక్కటే పని కాదు.అందుకే ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలి.నూన్యత భావం విడనాడాలి.సమస్యకు పరిష్కరం ముందు మీకు ,మీరు ఆలోచించుకోండి.అటుతరువాత మీ ఆలోచన ఇష్టం అయిన వారితో పంచుకోండి.ప్రవచనాల మాటున పక్కావ్యాపారాలు, లైంగిక దాడులు కుపాల్పడే వారికి అవకాశాలు ఇవ్వకండి.ఇటువంటి కేటు గాళ్ల కు అవకాశం ఇవ్వడం అంటే ఆత్మవంచన చేసుకోవడం తప్ప మరొకటి కాదు.ఆత్మవిశ్వాసం అయిదం గా ముందుకు వెళ్లాలి..

నా చిన్న అనుభవం..ఒక స్వామిజీ కార్యక్రమం వేసవిలో జరుగుతోంది.. జనం ఎక్కువ గా జమ అవుతున్నారు..సంఘ సేవ కోసం సంఘము ఏర్పడ్డ మిత్రులం.ఈ సారి వేసవి లో మనం పంచె మజ్జిగ ప్యాకెట్లు స్వామిజీ కార్యక్రమం వద్ద ఇద్దాం మనకు పెరు వస్తుందని వెళ్ళాం..పెక్కన చిన్న స్థలం నిర్వాహకులు ఇచ్చారు.. స్వామిజి పెద్ద కారులో వచ్చి మాకు కొద్ది దూరం లో దిగారు..మన దెగ్గర కి తీసుకు వచ్చి మజ్జిగ ప్యాకెట్ ఇద్దాం అని 4 గురము వెళ్ళాం… ఆయన సహాయకుడు ని కలిసాము.ఆయన చెప్పిన మాట విని దిమ్మ తిరిగింది.స్వామి వారి దర్శనం కు 1016 రూపాయలు,ఆయన చేతులు మీదుగా జామకాయ కావాలి అంటే 2 వేలు..అని రేట్లు మొదలు పెట్టారు..కుదరని వ్యవహారం అని .మా దుకాణం ఎత్తుకొని బైట గేటు వద్ద ఉన్న యాచకులు కు మజ్జిగ ప్యాకెట్లు పంచాము.మీ కడుపు చల్ల గా ఉండాలని ఆ యాచకులు చేసిన అస్వీర్వ దం మా అందరిని సంతృపి పర్చింది..ఇంకో విషయం స్వామి వారి వయస్సు నిండా 20 లేవు.ఆయన వాడే కారు ఖరీదు 2 కోట్లు,ముందు వెనుక ఎస్కార్ట్ కార్లు అదే స్థాయిలో ఉన్నాయి.అప్పుడే మా సంఘము నిర్ణయం చేసింది ఆధ్యాత్మికత ను గౌరవించే మనం..దాని మాటున జరిగే వ్యాపారం ను బట్ట బైలు చెయ్యాలి జనం ను చైతన్య పర్చాలి అని నిర్ణయచేసాం అమలు చేస్తున్నాం..అందుకే ఆధ్యాత్మిక వ్యాపారం బట్ట బైలు చేసిన నల్గొండ పోలీస్ కు ఈ జర్నలిస్ట్ షెల్యూట్

శనగపాటి మురళీకృష్ణ
(ఫ్రీలాన్స్ జర్నలిస్ట్)

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.