ల వంద పడకల ఆసుపత్రిగా చేయాలి..ఎమ్మెల్యేకివినతి పత్రం

0
TMedia (Telugu News) :

ల వంద పడకల ఆసుపత్రిగా చేయాలి.

s s consultancy

ఎమ్మెల్యేకివినతి పత్రం

టీ మీడియా ప్రతినిధి లక్షెట్టిపేట, మంచిర్యాల జిల్లా, జూన్06

లక్షేట్టిపేట్ మండల కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనంలో
మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే కి అదివారం రోజున లక్షేట్టిపేట్ ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలపై వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ… జన్నారం, దండేపల్లి, లక్షేట్టిపేట మూడు మండలాలకు పెద్ద ఆసుపత్రిగా ఉన్నటువంటి లక్షేట్టిపేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు పూర్తిగా లేవు.పాత ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరింది ప్రస్తుతం అందులో కరోనా టెస్టులు కోసం ఆ భవనంను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఆసుపత్రి భవనం వైద్యం కోసం వచ్చే రోగులకు సరిపోవడం లేదు.దాదాపు రెండు సంవత్సరాల నుండి వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని చెబుతున్న అధికారులు,ప్రజాప్రతినిధులు కనీసం ఇప్పటి వరకు దాని స్థల కేటాయింపు ఇతర నిర్మాణ పనులు కూడా మొదలు పెట్టలేదు. ఇది ఇలాగే ఉంటే ప్రజలందరికీ చాలా ఇబ్బందిగా మారుతుంది.కాబట్టి ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గారు మరియు ప్రజా ప్రతినిధులు జిల్లా సంబంధిత శాఖ అధికారులు స్పందించి మండల కేంద్రంలో తొందరగా 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభించి,మూడు మండలాల ప్రజలకు అందుబాటులో వైద్య సదుపాయాలు ఉంచాలి. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించాలి.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 19 జిల్లాలో డయాగ్నస్టిక్ సెంటర్ లను ఏర్పాటు చేస్తామని చెప్పింది. అందులో భాగంగా మన జిల్లాలోని లక్షేట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ డైగ్నోస్టిక్ సెంటర్ ను ఏర్పాటు చేసే దిశగా మన ఏమ్మెల్యే చొరవ తీసుకొని ఏర్పాటు చేపిస్తే నాలుగు మండలాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. మరియు మన ఆసుపత్రిలో సరిపడా డాక్టర్లు,సిబ్బంది లేకపోవడం తో ఆసుపత్రికి వచ్చే రోగులకు తప్పని ఇబ్బందులు.ముఖ్యంగా మన ప్రాంతాలలో ఎక్కువ యాక్సిడెంట్ మరియు పాయిజన్ వంటివి ఎక్కువగా జరుగుతుంటాయి.కాబట్టి వీటికి సంబంధించిన స్పెషలిస్ట్ ఎండి,ఆర్థోపెడిక్,గైనకాలజిస్ట్, డెంటల్,ఐ స్పెషలిస్ట్,ఇతర అన్ని విభాగాల స్పెషలిస్టు డాక్టర్లను నియమించాలి.
ప్రభుత్వ ఆసుపత్రి లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు కొంతమంది సమయానికి ఆస్పత్రిలో ఉండడం లేదు. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చే రోగులు చివరికి ఇంటి బాట పడుతున్నారు.
.శ్రీరాముల వెంకటేష్
కో- కన్వీనర్ అడ్లూరి హరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.