డాక్టర్ శ్యామ్ కుమార్ పై అభియోగాలు తగదు ; ఐఎంఏ వినతులు

0
TMedia (Telugu News) :

డాక్టర్ శ్యామ్ కుమార్ పై అభియోగాలు తగదు ; ఐఎంఏ వినతులు

s s consultancy

ఖమ్మం జిల్లా ఐఎమ్ఏ అధ్యక్ష కార్యదక్షులు
మరియు మెంబర్లు..ఆదివారం ఖమ్మం జిల్లా కలెక్టర్, కమిషనర్ ఆఫ్ పోలీస్ కి డిఎంహెచ్ ఓవారికి వినతి పత్రాన్ని అంద జేస్తు…..
తక్షణమే Dr శ్యామ్ కుమార్ పై నమోదు చేసిన తప్పుడు కేసు ను విరమింప చేయాలని కోరారు….
జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు….

పోలీసులు అతనిపై మోపిన అభియోగాలు వాస్తవ దూరంగా ఉన్నాయని అభిప్రాయ పడ్డారు…..
గత 2 సం౹౹ గా ఈ కరోనా పాండమిక్ టైంలో ఎంతో నిబద్ధతతో నిస్వార్ధం తో సేవలందించి పలువురి ప్రశంసలు అందుకున్న తమ తోటి డాక్టర్ పై ఇటువంటి ఆరోపణలు రావటం బాధాకరమని అన్నారు….
అతని పై వచ్చిన ఫిర్యాదు మేరకు టాస్క్ ఫోర్స్ లోని సభ్యులందరీ కి సమాచారం ఇవ్వకుండా శాస్త్రీయమైన సమగ్రమైన దర్యాప్తు జరపకుండా దర్యాప్తు అధికారులు దూకుడుగా వ్యవహరించారని అభిప్రాయపడింది….
ఈ కరోనా విలయతాండవం లో
ప్రాణాలకు తెగించి సేవలందిస్తు ఏంతో మందిని కాపాడటానికి తమ సాయ శక్తుల అహర్నిశలు శ్రమిస్తున్నా
డాక్టర్ల ను….కోవిడ్ వల్ల మృతి చెందిన కేసుల్లో హాస్పిటల్స్ ను వైదులను బాద్యులను చేయడం సరి కాదన్నారు…..
సదరు కేసులో మృతుడ్ని హయ్యర్ సెంటర్ కు రెఫెర్ చేయడం జరిగిందని
రెఫెర్ చేసిన వారం తర్వాత మరో హాస్పిటల్ లో జరిగిన మృతి కి ఈ డాక్టర్ ని బాద్యుడి చేయడం సరికాదన్నారు…. సోషల్ మీడియాలలో జరుగుతున్న అతిప్రచారాలతో హాస్పిటల్స్ లో జరిగే ప్రతి మృతి కి ఇంజెక్షన్ కారణం అనే సామాన్య ప్రజలు భావించే ప్రమాదం ఉందన్నారు…..
ఈ రకమైన కేసులు డాక్టర్లపై నమోదు చేయడం వలన డాక్టర్లలందరు
మానసిక వేదన కు గురి అవుతారని భవిష్యత్ లో కోవిడ్ కేసులను
చూడాలంటే వైద్యులు ముందుకు వచ్చే అవకాశం ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు….
డాక్టర్ శ్యామ్ గారి కి…గత లాక్ డౌన్ సమయంలో “ఉత్తమ కోవిడ్ డాక్టర్” కూడా ప్రభుత్వం ఇచ్చినట్లు గుర్తు చేశారు…
ఎవరూ కూడా రోగి ప్రాణాలు పోవడానికి వైద్యం చేయరని తెలుపుతూ…..
ఈ సంఘటన లో దర్యాప్తు అధికారుల చర్య వలన అందరు వైద్యులు మనో ధైర్యం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు….
ఈ విషయం లో గౌరవ కలెక్టర్ గారు విచారణ జరిపి కేసు ని విరమింప చేయాలని కోరారు….
ఒకవేళ సత్వర చర్యలు తీసుకోనట్లైతే భవిష్యత్ లో కోవిడ్ రోగులకు వైద్యం సాధ్యపడక పోవచ్చు ని….
సోమవారం నుంచి దశల వారిగా తమ నిరసన వ్యక్తం చేయాలని తీన్మానించారు….. ముందు ముందు తమ ఆందోళనను మరింత ఉదృతంగా చేయాలని తీన్మానించామని…
ఐఎంఏ అధ్యక్షులు Dr శోభా దేవి గారు
సెక్రెటరీ Dr ప్రదీప్ గారు తెలిపారు…

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.