కరోనా వైరస్ ను ఆరోగ్యశ్రీ లో చేర్చాలి

0
TMedia (Telugu News) :
s s consultancy

కరోనా వైరస్ ను ఆరోగ్యశ్రీ లో చేర్చాలి
టి-మీడియా/వనస్ధలిపురం(16):
తెలంగాణా రాష్ట్రం లో కొరోనా విజృంబిస్తుంన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్షవైఖరికి నిరసనగా బి.యన్. రెడ్డి. నగర్ కార్పోరేటర్ మొద్దు లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో యల్.బి.నగర్ నియోజకవర్గ బి.జే.పి. నాయకులు వనస్ధలిపురం గవర్నమెంట్ హాస్పిటల్ నందు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా బి.జే.పి. అధ్యక్షుడు సామ రంగారెడ్డి మాట్లాడుతూ హాస్పిటల్ లో ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతుందని, హాస్పిటల్ లో ప్రతి రోజు చేస్తున్న 200 కరోనా టెస్టుల్లో దదాపుగా 80 పాజిటివ్ కేసుల నిర్ధారణ అవుతున్నా హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన కరోనా ఇన్ పేషెంట్ వార్డులో కరోనా రోగులకు చికిత్స అందించడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వంద పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్ లో సరిపడా సిబ్బంది లేకపోవడం సిగ్గు చేటు అని విమర్శించారు.
రాష్ట్రం లో టి.ఆర్.యస్ ప్రభుత్వం వైఖరి పేరు గొప్ప ఊరు దిబ్బలా ఉందే కాని ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేదని వాపోయారు. గవర్నమెంట్ హాస్పిటల్ లో కరోనా ఇన్ పేషెంట్ లను చేర్చకోకుండా కరోనా పేరుతో ప్రైవేటు హాస్పిటల్స్ చేస్తున్న దోపిడీకి టి.ఆర్.యస్ ప్రభుత్వం వత్తాసు పలుకుతూ “ప్రైవేటు హాస్పిటల్స్ ముద్దు గవర్నమెంట్ హాస్పిటల్స్ వద్దు” అనే రీతిలో ప్రవర్తిస్తూ మొద్దు నిద్ర పోతుందని ఆరోపించారు.
హాస్పిటల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న యం.ఎల్.ఏ. హాస్పిటల్ ద్వారా నియోజకవర్గ ప్రజల కు ఒరగబెట్టినదేమీ లేదని,
ప్రభుత్వం ఇకనైనా తన మొద్దునిద్ర వీడి ప్రజల ప్రాణాలను కాపాడాలని, కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చి మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డును పరిశీలించి రికార్డులను తనికీ చేసి, హాస్పిటల్ లో కరోనారోగులకు అందిస్తున్న సేవల గురించి హాస్పిటల్ ఆర్.యం.ఓ. డాక్టర్ సోమశేఖర్ ను అడిగి తెలుసుకున్నారు.
యల్.బి.నగర్ నియోజకవర్గంలో 5 లక్షల జనాభా ఉంటే కనీసం 50 ఐసోలేషన్ బెడ్స్ కూడా ఏర్పాటు చేయలేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, డి.యం.అండ్.హెచ్ఓ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిర్లక్ష్యం వహిస్తున్న అదికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి మరియు కార్పొరేటర్లు వంగ మధుసూదన్ రెడ్డి , కొప్పుల నరసింహ రెడ్డి , వెంకటేశ్వర్ రెడ్డ్డిరాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి , సీనియర్ నాయకులు రఘు రామ్ నేత, రాజీ రెడ్డి, మహేందర్ రెడ్డి, డివిజన్i జనరల్ సెక్రెటరీ విష్ణు వర్ధన్ రావు, సంగమేశ్వర ,ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి,పార్టీ నాయకులు రవి శంకర్, శరత్,శ్రావణ రెడ్డి తదితరులు పాల్గొన్నవారు.

(వెంకట్ బెజవాడ, టీ మీడియా అధికార ప్రతినిధి)

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.