కమిషనర్ కు జనసేన పార్టీ వినతి

0
TMedia (Telugu News) :

కరోన సెకండ్ వేవ్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని
రామగుండం కార్పొరేషన్ కమిషనర్ కు జనసేన పార్టీ వినతి

s s consultancy

టీ-మీడియా ప్రతినిధి/ గోదావరిఖని,పెద్దపల్లి జిల్లా (మే 07)

కరోన సెకండ్ వేవ్ తీవ్రస్తాయిలో విజృంభిస్తున్న నేపధ్యంలో రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ప్రజల్లో వ్యాధి పట్ల అవగాహన కల్పించాలని కమిషనర్ ఉదయ్ కుమార్ కు జనసేన పార్టీ నాయకులు వినతిపత్రం అందజేసి కోరారు.అదే విధంగా అన్ని డివిజన్లలో గల్లీ గల్లీకి సానిటైజర్స్ స్ప్రే చేపించాలని,ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని కోవిడ్ టెస్ట్ చేయించుకొని తగు జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని,
కోవిడ్ వచ్చిన ప్రతి ఇంటి దగ్గర శానిటేషన్ స్ప్రే చేసి ఆ కుటుంబ సభ్యులు బయటకు రాకుండా ఉండేలా మందులు,ఆహార వసతులను కల్పించి ఆ యొక్క కుటుంబంకు భరోసా కల్పిస్తూ చుట్టూ ఉన్న ప్రజలు భయబ్రాంతులకు గురి కాకుండా ఉండేలా చూడాలని కోరారు.అలాగే ఐసోలేషన్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని కోరారు.కరోనాను కట్టడి చేయడానికి చర్యలు చేపట్టాలని రామగుండం నియోజకవర్గ జనసేన నాయకులు రావుల మధు, రావుల సాయి క్రిష్ణ,వడ్డేపల్లి రాకేశ్,ఎముర్ల రంజిత్, మోతే రవికంత్,బండరి తిరుపతి,శ్రవణ్,క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.