కలెక్టర్లు, అధికారులతో వీడియోకాన్ఫరెన్స్

0
TMedia (Telugu News) :

కలెక్టర్లు, అధికారులతో వీడియోకాన్ఫరెన్స్

s s consultancy

పలు అంశాల పై మాట్లాడిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్

టీ మీడియా జూన్ 05
ములుగు జిల్లా ప్రతినిధి

తెలంగాణ
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లు,సీనియర్ అధికారులతో కలెక్టరేట్ కాంప్లెక్సెస్ నిర్మాణాల పూర్తి, స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్, నూతన మెడికల్ కాలేజీలు,నర్సింగ్ కాలేజీలకు భూముల బదలాయింపు, ధరణికి సంబంధించిన విషయాలపై బిఆర్ కెఆర్ భవన్ నుండి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 12 జిల్లాలో కలెక్టరేట్ కాంప్లేక్స్ ను వారంలో గా పూర్తి చేసి ప్రారంభించడానికి సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.మిగతా జిల్లాలో కలెక్టర్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు.
స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల నిర్మాణంకోసం టిఎస్ఐఐసి కి భూములు హ్యాండ్ ఒవర్ చేసేలా చర్యలు ప్రారంభించాలన్నారు. ప్రభుత్వం ఇటీవల 7 జిల్లాలలో మంజూరు చేసిన నూతన మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం గుర్తించిన భూమి కేటాయింపు ప్రక్రియను ప్రారంభించాలని కలెక్టర్లను సియస్ ఆదేశించారు.ధరణిలో పెండింగ్ మ్యూటేషన్లు, భూవిషయాలకు సంబంధించిన గ్రీవేన్స్ మాడ్యూల్, ప్రొహిబిటరి ప్రాపర్టీలలో సమర్పించిన ధరఖాస్తుల పరిష్కార పురోగతిని సమీక్షించి,జూన్ 9 లోగా పరిష్కరించి తద్వారా ఆ రైతులు రైతుబంధు సహాయం పొందేలా చూడాలని ఆదేశించారు.స్పెషల్ ట్రిబ్యునల్ లో పెండింగ్ కేసులకు సంబంధించి హియరింగ్ లను నిర్వహించాలన్నారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి శనివారం రోజుల జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 9వ తేదీలోగా ధరణి పోర్టల్ ద్వారా భూసంబంధ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని, స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ నిర్మాణానికి స్థల పరిశీలన వేగవంతం చేస్తామని, జిల్లాలో పెండింగ్లో ఉన్న గ్రీవెన్స్ భూ సంబంధిత దరఖాస్తులను పరిశీలించి త్వరిత గతిన పూర్తి చేసి వివేదికలు సమర్పిస్తానని కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ జిల్లా రెవెన్యూ అధికారిణి రమాదేవి,ఇడిఎం దేవేందర్,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.ములుగు జిల్లా పౌర సంబంధాల అధికారిణి చే జారీ చేయనైనది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.