మంత్రి మల్లారెడ్డి కబ్జా భూముల పై సి.బి.ఐ తో విచారణ జరిపించాలి

0
TMedia (Telugu News) :

మంత్రి మల్లారెడ్డి కబ్జా భూముల పై సి.బి.ఐ తో విచారణ జరిపించాలి

s s consultancy

మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి.

అన్యాయాన్ని ప్రశ్నిస్తే పోలీసులు అరెస్టు చేసిన ఎన్ ఎస్ యు ఐ కార్యకర్తలను వెంటనే బేషరతుగా విడుదల చేయాలి.
టీ మీడియా అచ్చంపేట మే 8 : రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ అన్యాయం జరిగినా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్.ఎస్.యు.ఐ. విద్యార్థి విభాగం ఎక్కడైనా ప్రశ్నిస్తుంద నీ ఎన్ ఎస్ యు ఐ నేతలు తెలిపారు. వంద సంవత్సరాలు ప్రజా సంక్షేమం కొరకు పరిపాలన కొనసాగించిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రస్తుతం జరుగుతున్న భూకబ్జాల లాంటివి మేము చూడలేదని ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ అ అ ప్రశ్నిస్తే న్యాయం జరుగుతుంది అనుకున్న ప్రతి ఒక్కరిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆనవాయితీగా మారింద నీ నీ ఎన్ఎస్ యుఐ అచ్చంపేట శాఖ అధ్యక్షులు రామావత్ సంతోష్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఎందులోనైనా ఒక వ్యతిరేక వార్త వచ్చిందంటే ఆ యాజమాన్యాలను కొనడం లేక వాటిని నడవకుండా అభ్యంతరకరం తెలపడం రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య వారు అభివర్ణించారు ఇటువంటి అలవాట్లను పేద ప్రజలకు సకాలంలో అందించే సంక్షేమ పథకాలపై దృష్టి మరల్చి తే బాగుంటుందని వారు హితవు పలికారు. రాష్ట్రంలో కోవిడ్ కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో సోకిన రోగులకు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్సలు తీసుకోవటానికి బెడ్ లు దొరకక ఆక్సిజన్ సిలిండర్ లు సరి అయిన సమయంలో అందక అనేకమంది రోగులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఓటు వేసి గద్దెను ఎక్కించిన ప్రజలు పుట్టల లా రాలిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి అధికార దాహంతో మున్సిపాలిటీ ఎన్నికలు కావలసి వచ్చిందని వారు ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలు కరోనా వైరస్ తగ్గిన తరువాత పెట్టుకోవచ్చు కదా అని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్ ను ప్రశ్నించారు. కరోనా వైరస్ సోకి ప్రజలు చికిత్సలు తీసుకోవడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే అధికార పార్టీల నేతలు అక్రమంగా భూకబ్జాలు చేసి అందులో కోట్ల రూపాయలు విలువ చేసే ఆసుపత్రులను బిల్డింగులను నిర్మించి ప్రజలకు సేవలు అందిస్తామని పేద ప్రజల నుంచి చికిత్సల పేరుతో అధిక వసూలు చేస్తూ ఉండడం పై ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు కార్యకర్తలు ప్రశ్నించినందుకు నిరసనగా అమ్రాబాద్ మండల కేంద్రంలో నడిరోడ్డుపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇదే కాకుండా రాష్ట్రంలో ఏ ప్రజా ప్రతినిధి భూకబ్జాలు చేసిన వారిపై సిబిఐ చేత విచారణ జరిపించి సంబంధిత దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ రాష్ట్ర కమిటీ బృందాన్ని వెంటనే రిలీజ్ చేయాలి.
ఎన్.ఎస్.యు.ఐ.అచ్చంపేట, అధ్యక్షులు, రమావత్ సంతోష్ డిమాండ్ చేశారు.
మల్లారెడ్డి భూ కబ్జాలపై సీబీఐ విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని అచ్చంపేట ఎన్.ఎస్.యు.ఐ. తరఫున డిమాండ్ చేస్తున్నాం మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలను కోవిడ్ ఆసుపత్రిగా నిర్మించాలి సురవరం చెరువును కబ్జా చేసి నిర్మించిన ఆసుపత్రులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని కరోనా ఉచిత ఆసుపత్రులు గా మార్చాలి అదేవిధంగా మల్లారెడ్డి ని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాల నీ అదేవిధంగా ఎన్.ఎస్ .యు. ఐ. రాష్ట్ర అధ్యక్షులు బల్మూర్ వెంకట్ ను, పోలీసులు అరెస్టు చేసిన వారి బృందాన్ని వెంటనే రిలీజ్ చేయాలని అచ్చంపేట ఎన్.ఎస్.యు.ఐ. శాఖ తరపున డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎన్.ఎస్.యు.ఐ. సైనికులంతా కలిసి ధర్నాలు, రాస్తారోకోలు, చేపడతామని డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో తాలూకా జరనరల్ సెక్రటరీ, లడ్డు యాదవ్ ఈ కార్యక్రమంలో, యూత్ కాంగ్రెస్, అమ్రాబాద్, వైస్ ప్రెసిడెంట్, మహేష్, అంజన్ కుమార్, ఆంజనేయులు, నాగార్జున్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.