గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచాలి

0
TMedia (Telugu News) :

గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచాలి

s s consultancy

టీ మీడియా,జగిత్యాల,జూన్ 22

కరోనా విపత్తులోను ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న గ్రామపంచాయతీ సిబ్బందికి వేతనాలను పెంచాలని తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్,వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారికి ఇచ్చిన వినతిపత్రం లో కోరారు.మంగళవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ప్రకటన విడుదల చేశారు.కరోనా కష్ట కాలంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు గ్రామ పంచాయతీ సిబ్బంది కృషి చేస్తున్నారన్నారు.ఇంతగా కష్ట పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం వేతనాల పెంపులో వీరిని పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు.కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నుంచి మొదలుకొని జడ్పిటిసి, ఎంపిటిసిల వరకు వేతనాలు పెంచిన ప్రభుత్వం వీరి ప్రస్తావనే తీసుకొకపోవడం బాధాకరమన్నారు.ఎన్నో ఏండ్ల పోరాటం తదుపరి వీరి జీతాలను నామమాత్రంగా 2020లో 8,500 చేశారన్నారు.ఏప్రిల్,మే నెలలలోరెండుసార్లు ఇంసెంటివ్ లను ఇచ్చి ఆ తర్వాత నిలిపివేశారన్నారు.
ప్రజారోగ్య పరిరక్షణకు పాటుపడుతున్న గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలను పెంచేలా ప్రభుత్వం కు నివేధించాలని తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్,వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ముదుగం రాజలింగు, అధ్యక్షులు పులి మల్లేశం, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, వంగ రాజేశంలు కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.