ఆనాటి జిల్లా కలెక్టర్ లక్ష్మి పార్ధ సారథి ఆదేశాలను అమలు చేయాలి

0
TMedia (Telugu News) :

టి మీడియా, వెంకటాపురం – జూలై 31 :

s s consultancy

వెంకటాపురం మండలం పరిధిలో గల లక్ష్మీ నగరం ఆదివాసులకు పట్టా పాసు పుస్తకాలు మంజూరు చేయాలని శనివారం తాసిల్దార్ గారికి వినతి పత్రము అందించారు. ఈ సందర్భంగా ఆదివాసి సీనియర్ నాయకులు పూనేమ్ సాయి మాట్లాడుతూ గతంలో పని చేసిన జిల్లా కలెక్టర్ లక్ష్మీ పార్థసారథి గారు గుట్టల మీద నుండి దించి, సర్వే నెంబర్ 9/పి లో ప్రభుత్వం లక్ష్మీ నగరం ఆదివాసులకు ఇస్తే ఇంత వరకు ఆదివాసులకు పట్టా పాస్ పుస్తకాలు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. ఆ నాటి జిల్లా కలెక్టర్ లక్ష్మీ పార్థ సారథి ఆదేశాలను రెవెన్యూ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని, ఏజెన్సీ ప్రాంతంలో భూమి, నీరు, అడవి పై ఆదివాసులకు హక్కు ఉందని ఆయన అన్నారు. లక్ష్మీ నగరం ఆదివాసులకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వకపోతే తాసిల్దార్ కార్యాలయం ఎదుట దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉయిక శంకర్, ఉయిక సంతోష్. ఆదివాసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

District Collector Lakshmi Parthasarathy had come down from the hills and questioned why government had not given Patta Pass to the tribals in Survey No.9/p so far. 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.