కాలుష్యం తో జీవజాతులకు ముప్పు; ఆరోగ్య హక్కు వేదిక.

0
TMedia (Telugu News) :
s s consultancy

కాలుష్యం తో జీవజాతులకు ముప్పు; ఆరోగ్య హక్కు వేదిక.

టీ మీడియా ప్రతినిధి మంచిర్యాల జిల్లా, మే 22
అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా శనివారంమంచిర్యాల జిల్లాలోని రామకృష్ణపూర్ ఆరోగ్య హక్కు వేదిక కార్యాలయంలో సభ్యుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వేదిక అధ్యక్షుడు రాజలింగు మోతె మాట్లాడుతూ…..జీవరాశి, ప్రకృతి మధ్య సమతౌల్యం లేకపోతే జంతువులు, పక్షుల నుంచి మనుష్యులకు రోగాలు సోకుతాయన్నారు. ప్రపంచం మొత్తాన్ని గడ గడ లాడిస్తున్న కరోనా కూడా ఇలా సోకిందే నని అన్నారు. జనాభా పెరుగుదల ,నగరీకరణ,విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగం, ఇష్టారాజ్యంగా పరిశ్రమలను ఏర్పాటుచేయడం, యథేచ్ఛగా గనుల తవ్వకాలు, వ్యవసాయం లో విషపూరిత రసాయన ఎరువులు వాడకం తదితరాలు జీవజాతుల కు ముప్పును కలుగజేస్తున్నాయన్నారు. పెరుగుతున్న భూతాపాన్ని నియంత్రించి, జీవవైవిద్యాన్ని కాపాడుకోలేకపోతే మానవ మనుగడ కే పెను ముప్పు వాటిల్లుతుందని అన్నారు.మొక్కలు పెంచి అడవులను సంరక్షించి జీవరాశుల ను కాపాడుకుందాం.. వాటిని బతకనిద్దాం.. అని ఆయన పిలుపు నిచ్చారు.జీవరాశుల పరిరక్షణకు ప్రభుత్వాలు, పాలకులు కృషిచేస్తేనే భావితరాలకు భవిష్యత్తు అందుతుందని అన్నారు.
కార్యక్రమంలో నాయకులు లింగంపెల్లి అక్షర్, ఓరగంటి సాయి,ఉప్పుల సాయి తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.