ఆయన మాటే కాజల్‌కు వేదమట!

0
TMedia (Telugu News) :
s s consultancy

ఆయన మాటే కాజల్‌కు వేదమట!
టాలీవుడ్‌ మిత్రవింద కాజల్‌ వైవాహిక జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తుంది. జనరల్‌గా పెళ్లి కుదిరిన ప్రతి హీరోయిన్‌ ఇక సినిమాల్లో నటిస్తుందా అన్న అనుమానం అభిమానులకు కలుగుతుంది. ఇప్పుడు అదే అనుమానం కాజల్‌ విషయంలో కలిగింది. ప్రస్తుతం కాజల్‌ పెళ్లికి ముందు అంగీకరించిన ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తోంది. తన భర్త గౌతమ్‌ కిచ్లుతో కలిసి ఈ సినిమా సెట్లో సందడి చేసిన విషయం తెలిసిందే! రానున్న రోజుల్లో కాజల్‌ సినిమాల్లో నటిస్తుందా అంటే జవాబు అనుమానంగానే వినిపిస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కాజల్‌కు ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. అందుకు సమాధానంగా కాజల్‌ ‘‘నా భర్త ఎప్పుడు సినిమాల్లో నటించడం ఆపేయమంటే అప్పుడు ఆపేస్తాను. నా కుటుంబ సభ్యులు తర్వాత నా భర్త సహకారంతోనే నేను ముందుకు వెళ్లగలుగుతున్నా. ఎంతకాలం సినిమాల్లో నటిస్తానో తెలియదు. కానీ కిచ్లు నో అన్న రోజు తప్పకుండా యాక్టింగ్‌ ఆపేస్తా’’ అని కాజల్‌ అగర్వాల్‌ తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.