జగ్జీవన్ రామ్ స్పూర్తితో దళితుల పథకాలు

వర్ధంతి సభలో ఆర్జేసీ కృష్ణ

0
TMedia (Telugu News) :

జగ్జీవన్ రామ్ స్పూర్తితో దళితుల పథకాలు

వర్ధంతి సభలో ఆర్జేసీ కృష్ణ

ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ తో
పాటు,దళిత,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన పలువురు మహనీయుల,సంఘ సంస్కర్తల,సామాజిక వేత్తల స్పూర్తితో ఆయా వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుందని టిఆర్ ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ ఇంచార్జీ గుండాల(ఆర్జేసీ)కృష్ణ అన్నారు.

s s consultancy

Read alsoనిందితులనుహైదరాబాద్ తీసుకువచ్చిన ఎన్.ఐ.ఏ

మంగళ వారం జగ్జీవనరాం వర్థంతి సందర్భంగా కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలో మరో అతిధి సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,పలువురు ఎస్.సి.విభాగం నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

 

అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం మహనీయుల బాటలో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు.దీనిలో భాగంగా ముఖ్య మంత్రి కేసీఆర్ రూ.వెయ్యి కోట్ల రూపాయల నిధుల తో ఇటీవల నే దలిత్ ఎంపవర్మెంట్ పథకాన్ని ప్రవేశ పెట్టారని తెలిపారు.దీనికంగుణంగా జిల్లా లో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నాయకత్వంలో ముందుకు సాగుతుందని వివరించారు.ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా ఎస్సి విభాగం శ్రేణులు పాటు పడుతూ పనిచేయాలని పిలుపు నిచ్చారు.అదే మహానీయులకు అర్పించే నివాళి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ ఎస్సి విభాగం నగర అధ్యక్షులు హెచ్చు ప్రసాద్ జిల్లా,నగర నాయకులు,బొమ్మెర రామ్మూర్తి, బుర్రి వినయ్ కుమార్,కంచర్ల దయాకర్,నామవరపు ఈశ్వర్,బుర్రి వెంకట్ కుమార్,కోడిరెక్కల ఫ్రాన్సిస్,కొత్తపల్లి రాజా,నామవరపు సతీష్,పార్టీ నాయకులు,దండా జ్యోతిరెడ్డి, అయ్యప్ప రెడ్డి,తాజుద్దీన్, మాటేటి కిరణ్, షకీనా,మనోహర్,వలీ, తదితరులు పాల్గొన్నారు…

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.