పోలవరం ట్రైల్ రన్… 1986వరద

0
TMedia (Telugu News) :

కాపర్ డ్యామ్ నిర్మాణంలో వుండగానే

s s consultancy

  • ఈ సారి వచ్చే వరదకు బట్టి ముంపు అంచనా వేయ్యెచ్చు
  • రాబోయే వరదను బట్టి ముంపు సర్వేలు మారొచ్చా?
  • గత వరదలు ను మించి ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు వెల్ల వలసిందే.
  • ప్రభుత్వం ఒక దశలో అన్ని సమకూర్చక పోవచ్చు.
  • పరిస్థితులను భట్టి ప్రజలు ప్రమత్తంగా ఉండాలి.

వి.అర్.పురం,( 05;- (ఇక రాబోయే వరదలు మీద అధికారులకే అంచనాలు లేవు. కానీ గతంలో 1986 లో వచ్చిన వరదలా రావచ్చని కేవలం అంచనాలు మాత్రమే వేస్తున్నారు. కాపర్ డ్యామ్ సగంలో నిర్మాణం వుండగానే గత సంవత్సర వరదలు పీఠజలు బెంబేలెత్తించాయి. అప్పుడే ఊర్లు మీద 15 రోజుల వరకు గోదావరి నిలబడి ఉంది. ఈ సారి నెల పైనే ఉండొచ్చని అధికారులు అంటున్నట్లు ముంపు మండలాల్లో పలువురు ఆరోపిస్తున్నారు. ఇలా ఉంటే ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని భయపడుతున్నారు. ఎతైన ప్రాంతానికివెళ్లి తలదాచుకోవడం మంచిదని అనుభవిజ్ఞులు సైతం అంటున్నారు. ఇప్పటికి పోలవరం సర్వేల్లో కొద్దిగ్రామాలే 41.75 కి ముంపుకు గురౌతాయని అంటున్నారు. కానీ జాబితా తారుమారు అయ్యే అవకాశం ఉంది. )

  • ఇది ట్రైల్ రన్నే
    ప్రస్తుతం రాబోయె గోదావరి పోలవరంకు ట్రైల్ రన్ అని చెప్పవచ్చు. ఇప్పుడు వచ్చే వరదలు ఎక్కడ వారికి వస్తాయి. ఎన్ని గ్రామాలు ముంపులోకి వస్తాయని అంచనాలను వెయ్యనున్నారని సమాచారం. గేట్లు ఎత్తకుండా ఎన్ని క్యూసెక్కుల నీరు వస్తది, యంతవరుకు గోదావరి నీటి మట్టం ఉంటున్నది అనే విషయం పై సమగ్ర సమాచారం ప్రభుత్వం తీసుకుంటదేమో అని కొందరు అంచనా వేస్తున్నారు.
  • వీళ్ళ ట్రైల్ సరే, బాధితులు పరిస్థితి ఘోరం
    ప్రస్తుతం వచ్చే గోదావరి వరద గేట్లు వేసిన తరువాత ఎంత వస్తది అనే విషయంలో ప్రభుత్వం ట్రైల్ గట్లా వేస్తే నిర్వశిత గ్రామాల్లో ముంపు ఎక్కువగా ఉండొచ్చని పరిస్థితి ఘోరంగా ఉండొచ్చని, నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. కాబట్టి స్పిల్వ్ ద్వారా నీటిని దిగువకు పంపించడం మంచిది.
  • పోలవరం సర్వేలు తారుమారు.
    గతంలో 41.72 కాంటూరు లెవల్లో ముంపు మండలాల్లో చాలా తక్కువ గ్రామాలు ముంపుకు గురౌతాయని ప్రభుత్వం లెక్కలు చెప్పింది. కానీ ఆ సర్వేలన్ని తారుమారు అయ్యాయని తేట తెల్లమవుతుంది. తప్పుడు లెక్కల వలన ప్రజలు ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఈ సారైనా వాటర్ లెవల్ అధికారులతో సర్వే సమగ్రంగా చేయించి వలసిన అవసరం ఉన్నది. ఏది ఏమైనా ఈ వరదలు పోలవరం ట్రైల్ రన్ వెయ్యొచ్చు అనేది బాహాటంగా నిర్వాసితులు అంటున్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.