ముందుకు సాగని వంతెన నిర్మాణ పనులు

0
TMedia (Telugu News) :

ముందుకు సాగని వంతెన నిర్మాణ పనులు

s s consultancy

టి మీడియా వనపర్తి జూన్ 1

వనపర్తి పట్టణంలోని వంతెన నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు. వర్షంకాలం వస్తుంది. ఈ వర్షంకాలంలో వర్షాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ కె.నాగరత్న అంచన వేశారు. పట్టణంలోని శ్వేతానగర్ కాలనీలో, రామటాకిస్, చింతలహనుమన్, జెర్రిపోతులమశమ్మ, వాగులకు వంతెనలు సరిగ్గా లేవు. ఇదే విషయాన్ని మున్సిపల్ కమిషనర్ ను సంప్రదిస్తే శ్వేతానగర్ కాలనీలో తాళ్ల చెరువు వాగు పై నిర్మిస్తున్న రెండువంతెనలకు టిఎఫ్ఐటిసి నిధులు రూ.50లక్షలు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇందులో ఒకటి పూర్తి అయింది మిగత ఒకటి పని జరుగుతుంది అన్నారు. మిగతా మూడు వంతెనలు అర్ అండ్ బి వారికి సంబంధించినవి అన్ని చెప్పారు. జెర్రిపోతులమశమ దగ్గర ఉన్న వంతెన పూర్తి దెబ్బ తిన్ని రాళ్ళ ఉండిపోవడం జరిగింది. ప్రమాదం జరుగుతే ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. పోయిన వర్షంకాలంలో ఇక్కడ ఇద్దరు చనిపోవడం జరిగింది.ఇప్పటికైన అధికారులు వంతెన నిర్మాణ పనులు పూర్తి చేసి కాలువ లో పూడిక తిస్తే బాగుంటుంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.