స్థానిక ఎమ్యెల్సి టిఆర్ఎస్ అభ్యర్థి గా తాత మధు

స్థానిక ఎమ్యెల్సి టిఆర్ఎస్ అభ్యర్థి గా తాత మధు

0
TMedia (Telugu News) :

-సోమవారం నామినేషన్..?

s s consultancy

టీ మీడియా, నవంబర్ 20, హైదరాబాద్:

స్థానిక సంస్థల ఉమ్మడిఖమ్మం జిల్లా టిఆర్ఎస్ అభ్యర్థి గా టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాత మధు ను అధిష్టానం ఎంపిక చేసినట్లు తెలిసింది..సోమవారం నామీనేషన్ వేయనున్నట్లు సమాచారం.. అమెరికా తెలుగుసంఘం (,తాన)అధ్యక్షుడు గా పనిచేసిన కాలం లో.అక్కడి తెలంగాణ వారిని కేసీఆర్ తెలంగాణ ఉద్యమం లో నిలపడం ద్వారా టిఆర్ఎస్ కి మధు దెగ్గర అయ్యారు.ఖమ్మం జిల్లా తిరుమలాయ పాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన మధు ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి సంఘం ద్వారా రాజకీయాల్లో కి ప్రవేశించారు.సిపిఎం నేపథ్యం ఉన్న మధు.ఎమ్యెల్సి పల్ల రాజేస్వర రెడ్డి కి మంచి మిత్రుడు. వివాద రహితుడి గా ఉండటం, అమెరికా నుండి వచ్చి స్థానికం గా ఉడటం, తెలంగాణ ఉద్యమం లో కీలకం గా పని చేయటం,టిఆర్ఎస్ అధికారం లోకి వచ్చిన ఎటువంటి పదవి లేక పోయినా పార్టీ ఇచ్చిన హోదాతో నే పార్టీ నిర్మాణం, ఎన్నికల్లో విజయాలు విషయం లో కీలకమైన వ్యక్తిగా ఉడటం ,క్యాడర్ ,జనం తో సమందాలు లాంటి అంశాలు తో పాటు,మంత్రి అజయ్ కుమార్,ఎంపి నామ నాగేశ్వర రావు , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి,ఆమోదం తెలపటం లాంటి అనేక విషయాలను పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేసినట్లు తెలిసింది. మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్యెల్సి గా పోటీకి నిరాశక్తత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే మధు ఎంపిక విషయం అధికారికం గా ప్రకటన రావాల్సి ఉంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
vasi web
abhaya hospitals