బావ.. నీ బాధ చూడలేకే! గర్భిణీ ఆత్మహత్య

0
TMedia (Telugu News) :

బావ.. నీ బాధ చూడలేకే! గర్భిణీ ఆత్మహత్య

టీమీడియా నిజామాబాద్ ప్రతినిధి:

s s consultancy

బావ.. నీ బాధ చూడలేకే! 
ఆత్మహత్యకు పాల్పడిన నాలుగు నెలల గర్భిణి
నిజామాబాద్‌: పెళ్లయి ఏడాది కూడా పూర్తికాకుండానే నాలుగు నెలల గర్భిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్‌ నగరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని దుబ్బకు చెందిన యువతి నిజామాబాద్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఖానాపూర్‌కు చెందిన సొంత మేనత్త కుమారుడు ప్రేమించుకున్నారు. వారి ప్రేమ విషయం ఇరు కుటుంబాల పెద్దలకు చెప్పడంతో కుటుంబీకులు వారికి 2020 జూన్‌ 16న వివాహం జరిపించారు. ప్రస్తుతం ఆమె నాలుగు నెలల గర్భిణి. 
ఇటీవల ఆ కుటుంబంలో కలతలు ఏర్పడి మేనత్త సదరు గర్భిణిని సూటిపోటి మాటలతో వేధించడం ప్రారంభించింది. ఈ క్రమంలో గర్భిణి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడగా.. ఇంటి వద్ద జారిపడి  మృతి చెందిందని అంత్యక్రియలు పూర్తి చేశారు. కుమార్తెను పోగొట్టుకున్న గర్భిణి తల్లిదండ్రులు సైతం ఫిర్యాదుకు వెనకడుగు వేయడంతో గుట్టు చప్పుడు కాకుండానే అంత్యక్రియలు నిర్వహించారు. రెండు కుటుంబాల వారు రక్త సంబంధీకులు కావడంతో ఆత్మహత్య విషయం వెలుగులోకి రాలేదు. అయితే.. ఆత్మహత్యకు పాల్పడే ముందు గర్భిణి రాసిన లేఖ బయటపడటంతో అసలు విషయం వెలుగుచూసింది.  

భావ నీవు బాధ పడవద్దు

‘‘నా చావుకి కారణం అత్తమ్మ. బావ నువ్వు బాధపడటం నాకు ఇష్టం లేదు. అత్తమ్మకి నాకు మధ్యలో నువ్వు నలిగిపోవడం నాకు నచ్చట్లేదు. ఆమెతో నాకు సరిపోయింది. నన్ను క్షమించండి అమ్మా నాన్న. ఐ యామ్‌ సారీ రవళి, బావ.. చెల్లి జాగ్రత్త. మామయ్య ఆరోగ్యం జాగ్రత్త. నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నీ పొట్టి’’ అని సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. సూసైడ్‌ నోట్‌  వెలుగులోకి రావడంతో గర్భిణి ఆత్మహత్య చేసుకున్నట్టు తేలింది. దీనిపై త్రీటౌన్‌ ఎస్‌ సంతోష్‌ను వివరణ కోరగా.. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.