రంజాన్ కానుకలు పంపిణీ చేసిన కార్పొరేటర్లు.

0
TMedia (Telugu News) :
s s consultancy

రంజాన్ కానుకలు పంపిణీ చేసిన కార్పొరేటర్లు.
టీ మీడియా//రామగుండం //పెద్దపల్లి జిల్లా.
రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ స్థానిక 45 వ డివిజన్ తిలకనగర్ మసీదు లో ఆదివారం రంజాన్ పర్వదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకలు ఇవ్వడం జరుగుతుంది.అందులో భాగంగా రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్  ఆదేశాల మేరకు ముఖ్య అతిధులుగా 45 వ డివిజన్ కార్పొరేటర్ కొమ్ము వేణు మరియు 37 వ డివిజన్ కార్పొరేటర్ పెంట రాజేష్ హాజరై రంజాన్ కానుకలు పంపిణీ చేయడం జరిగినది.ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్  అన్ని మతాల వారిని సమానంగా చూస్తూ దేశంలో ఎక్కడ లేని విధంగా మైనారిటీలకు సంక్షేమపథకాలు అమలు చేస్తున్నారని అలాగే ఎల్లవేళలా సహాయ సహకారాలు అందజేస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపిన విధంగా కరోనా నియమాలను పాటిస్తూ రంజాన్ జరుపుకోవాలని తెలియజేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొమ్ము వేణు ,పెంట రాజేష్ మరియు ముస్లిం పెద్దలు, ముస్లిం సోదరులు,లబ్దిదారులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.