మంచిర్యాల జిల్లా వాసుల కల ఈ వైద్య కళాశాల.. ఎమ్మెల్యే దివాకర్ రావు.

0
TMedia (Telugu News) :

మంచిర్యాల జిల్లా వాసుల కల ఈ వైద్య కళాశాల

మంచిర్యాల జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేసిన‌ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కి కృతజ్ఞతలు తెలిపిన : ఎమ్మెల్యే దివాకర్ రావు.

s s consultancy

మంచిర్యాల జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరింది

టీ–మీడియా ప్రతినిధి (మే 18) మంచిర్యాల జిల్లా:

మంచిర్యాల జిల్లా కు ప్రభుత్వ వైద్య కళాశాల,మరియు నర్సింగ్ కళాశాలలను మంజూరు చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ కి మంచిర్యాల జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే దివాకర్ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. ప్రభుత్వ వైద్య కళాశాల మంచిర్యాల జిల్లా ప్రజల చిరకాలపు కోరిక నెరవేరిందని అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక చొరవతో జిల్లాకు మెడికల్,నర్సింగ్ కాలేజీలు మంజూరు చేయడం జరిగిందని.సోమవారం రాత్రి ప్రగతి భవన్ లో కోవిడ్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిపారని.ఈ సమావేశంలో మంచిర్యాలకు ,కొత్తగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం స్పష్టం చేశారు.ఈ మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీని కూడా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే అనుమతులు వచ్చినా నర్సింగ్ కాలేజీల మంజూరు ప్రతిపాదలను కూడా వెంటనే పరిశీలించాలని సీఎం సూచించారని ఎమ్మెల్యే దివాకర్ రావు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.