వాంకిడి చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన సత్యనారాయణ ఐపీఎస్

0
TMedia (Telugu News) :

వాంకిడి చెక్ పోస్ట్ ను ఆకస్మిక తనిఖీ చేసిన సత్యనారాయణ ఐపీఎస్.?

s s consultancy

టీ మీడియా ప్రతినిధి కృష్ణపల్లి సురేష్ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా.

*కొమురంభీం అసిఫాబాద్ జిల్లా తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని వాంకిడి చెక్ పోస్ట్ ను తనిఖీ చేసి పరిస్థితిని పర్యవేక్షించిన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇంచార్జి ఎస్పీ రామగుండం సిపి శ్రీ వి. సత్యనారాయణ, I.P.S.తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో వాంక్డి చెక్ పోస్టు వద్ద పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే వాహనాలు, వాహనదారుల తనిఖీ, తాజా పరిస్థితిని సీపీ గారు పర్యవేక్షించారు.తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ నేపథ్యంలో విధించిన ఈ 10 రోజుల లాక్ డౌన్ గత 06 రోజుల నుండి పటిష్ఠంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు లాక్ డౌన్ మినహాయింపు సమయంలోనే ప్రయాణాలు కానీ లేక ఏదైనా అవసర నిమిత్తం పని ఉంటే చూసుకోవాలని 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితి లో బయటకు రాకూడదని, అనవసరంగా ఏలాంటి కారణాలు లేకుండా బయటకు వచ్చినట్లయితే కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. తప్పనిసరి చేసిన ఈ పాస్, కోవిడ్ రోగులు అయితే ఆసుపత్రి లెటర్ తో పాటు కోవిడ్ కంట్రోల్ రూమ్ ద్వారా జారీ చేయబడిన పాసులు ఉన్న వారినే అనుమతించడం, ఇతర జిల్లాల నుండి నిత్యావసర వస్తువుల వాహనాలు మరియు అత్యవసర సేవల క్రింద తెలుపబడిన వాహనాలు తప్ప ఎలాంటి వాహనాలు అనుమతించవద్దని సిబ్బందికి ఆదేశించారు. నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ప్రజలు కూడా సహకరించి నిబంధనలు తుచ తప్పకుండా పాటించాలన్నారు. చెక్ పోస్ట్ వద్ద పోలీస్ అధికారులతో మాట్లాడి వారికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయడంతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి తెలంగాణాలోకి వచ్చే వారు సరిహద్దుల వద్దకు వచ్చి ఇబ్బందులు పడవద్దని సీపీ గారు కోరారు. ఇతర శాఖ అధికారులతో సమన్వయం చేస్తూ లాక్డౌన్ ను పటిష్టంగా అమలు పరచాలని సూచించారు.సీపీ గారి వెంట ఎస్పీ శ్రీ వై. వి. ఎస్. సుధీంద్ర, డిఎస్పీ ఆసిఫాబాద్ శ్రీ అచ్చేశ్వర్ రావు, వాంకిడి సీఐ సుధాకర్, ఎస్ఐ రమేష్,ఇతర పోలీస్ అధికారులున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.