తనిఖీ చేసిన మంచిర్యాల డిసిపి ఉదయకుమార్ రెడ్డి

0
TMedia (Telugu News) :

తనిఖీ చేసిన మంచిర్యాల డిసిపి ఉదయకుమార్ రెడ్డి.

పోలీస్ సిబ్బంది నీరు,మజ్జిగ, గ్లూకోస్ లాంటివి తీసుకోవాలి.

s s consultancy

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు కఠిన తీసుకోబడును.

టీ మీడియా ప్రతినిధి లక్షెట్టిపేట మంచిర్యాల జిల్లా.

తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన నేపద్యంలో రామగుండం సిపి సత్యనారాయణ ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి లక్షెట్టిపేట్ పట్టణంలోని కరీంనగర్ చౌరస్తాలో గల పోలీస్ చెక్ పోస్ట్ ను సందర్శించడం జరిగింది. లాక్ డౌన్ ఉన్నపటికీ నిబంధనలకు విరుద్ధంగా బయట తిరిగే పలు వాహనాలను ఆపి కేసులు నమోదు చేశారు. పోలీస్ సిబ్బందికి సానీటీజర్, మజ్జికా ప్యాకెట్లను అందజేశారు. సిబ్బంది కోవిడ్-19 పట్ల జాగ్రత్త తీసుకుంటూ విధులు చేయాలన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని వాటర్, మజ్జిగ, గ్లూకోస్ లాంటివి తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా డిసిపి ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…..
గత ఐదు రోజుల నుండి నేటి వరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆక్ట్ ప్రకారం, లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘన గైడ్లైన్స్ ప్రకారం మూడు వేలకు పైగా కేసులను నమోదు చేయడం జరిగిందని తెలిపారు.అదే విధంగా రోజురోజుకి ప్రజల్లో మార్పు కనిపిస్తోందని, లాక్ డౌన్ నిబంధనలను పాటించడంతో పాటు లాక్ డౌన్ మినహయింపు ఇచ్చిన సమయంలో ప్రజలు భౌతిక దూరాన్ని పాటించడం జరుగుతోందని అన్నారు.ఇదే విధంగా కొనసాగితే మనమందరం కలిసి కరోనాను నియంత్రించడం వీలు అవుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో లో మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్, లక్షెట్టిపేట సీఐ నారాయణ, లక్షెట్టిపేట ఎస్సై చంద్రశేఖర్, దండేపల్లి ఎస్సై శ్రీకాంత్, పిఎస్సై హైమ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.