చేతకికపోతే ఇంట్లో కూర్చోండి: విపక్షాలపై మంత్రి తలసాని ఫైర్

0
TMedia (Telugu News) :

చేతకికపోతే ఇంట్లో కూర్చోండి: విపక్షాలపై మంత్రి తలసాని ఫైర్

టీ-మీడియా/హైదరాబాద్(మే-17):

s s consultancy

*విపక్ష నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం.
*ప్రజలకు చేతనైనంత సాయం చేయాలని విపక్షాలకు సూచన.
*అలా చేయకపోతే ఇంట్లో కూర్చోవాలని సెటైర్.

కరోనా సమయంలో విపక్షాలు ప్రజలకు చేతనైనంత సాయం చేయకుండా అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు.
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విషయంలో ప్రభుత్వం తీరుపై విమర్శలు చేస్తున్న విపక్ష నేతలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి విపత్కర సమయంలో చేతనైతే సాయం చేయాలని, లేకపోతే ఇంట్లో కూర్చోవాలని సలహా ఇచ్చారు. కరోనా కట్టడిపై జీహెచ్ఎంసీలో సోమవారం జరిగిన మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే జరుగుతోందని, ఇప్పటివరకు 9లక్షల మందికి పరీక్షలు చేశామని తెలిపారు.
కరోనా రోగులకు వారి సహాయులకు స్వచ్ఛంద
కార్యక్రమాలు చేపట్టేవారు ప్రభుత్వం ఇచ్చిన గడువు సమయంలోనే నిర్వహించుకోవాలని మంత్రి తలసాని సూచించారు. కరోనా రోగులతో పాటు వచ్చేవారికి ఇబ్బంది కలగకుండా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద అన్నపూర్ణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్‌‌లు ఆపే విషయాన్ని కొందరు దురుద్దేశంతో రాజకీయం చేయడం సమంజసం కాదన్నారు.
మొదటి ప్రాధాన్యత తెలంగాణా ప్రజలకు ఇవ్వాలన్న కారణంగానే అంబులెన్స్ లను అనుమతించే విషయం కాస్త ఆలస్యమైందే కానీ వేరే ఇతర కారణాలు లేవని,
హైదరాబాద్‌లో బెడ్స్ ఖాళీగా లేవని బెడ్స్ ఖాళీగా లేనందున రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అంబులెన్స్‌ను ఆపాల్సి వచ్చిందని, బెడ్స్‌ ఖాళీ ఉంటే ఎవరైనా సిటీకి వచ్చి ట్రీట్‌మెంట్ చేయించుకోవచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న నాలుగు రాష్ట్రాలకు కల్పతరువు లాంటిదని ఇక్కడ ఎవరైనా ఆయూ హాస్పిటల్ అనుమతితో చికిత్స తీసుకోవచ్చని సూచించారు.

(వెంకట్ బెజవాడ, టీ మీడియా అధికార ప్రతినిధి)

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.