టెస్ట్ ఇక్కడ ..అప్రూవల్ అక్కడ; డయాజ్ఞటిక్ సెంటర్లు

0
TMedia (Telugu News) :

టెస్ట్ ఇక్కడ ..అప్రూవల్ అక్కడ; డయాజ్ఞటిక్ సెంటర్లు

(టీమీడియా ప్రత్యేక ప్రతినిధి)

s s consultancy

ఖమ్మం నగరం లో అనుమతి లేని డయజ్ఞటిక్ సెంటర్లుకు,శంకర్ దాదా ఎంబీబీఎస్ లకు కొదవ లేదు..జనం ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వీరు.అర్హత లేని వారితో అన్ని పనులు చేయిస్తూ .డబ్బులు దోచుకొని దాచుకొంటున్నారు.మెడికల్ షాపుల్లో షుగర్ ,బిపి టెస్టులు,కళ్ళ జోళ్ళ షాపుల్లో కంటి పరీక్షలు అంటూ క్వాలిఫై డాక్టర్ ల వృత్తి ని అపహాస్యం చేసున్న పట్టించు కొనే వారు లేరు..ఐసిఎమ్ఆర్ అప్రూవల్, ఐఎస్ ఓ సర్టిఫికెట్ ఉన్న వారు.బ్రాంచిలు ప్రారంభించి..అక్కడే పిసిఆర్ టెస్ట్(బ్లాక్ ఫంగస్),టెస్టులు చేస్తాము అని బహిరంగ ప్రకటన ఇస్తున్నారు..బ్రాంచి ఏర్పాటు ఉన్న అనుమతులు తెలియవు..బ్రాంచి లో ఉన్న సిబ్బంది కి ఉన్న విద్యార్హతలు నిబంధనలు ప్రకారం డిసిప్లే ఉండదు.బ్రాంచి సిబ్బంది టెస్ట్ చేసి రిపోర్టులు అసలు డాక్టర్ కి ఆన్లైన్ లో పంపి అప్రూవల్(అనుమతి)తీసుకొంటున్నట్లు పేర్కొంటున్నారు.డాక్టరు డిజిటల్ సంతకం చేసిన రిపోర్ట్ కాయితం చేతిలో పెడుతున్నరు.కద అడ్డం తిరిగితే డాక్టర్ సంతకం నాది కాదు ఫోర్జరీ చేశారు అన్న చేయగలిగింది లేదు. కరోన ను అడ్డం పెట్టుకొని చెలరేగిన మెడికల్ మాఫియా రూపం లో ఇది ఒకటి.స్కానింగ్ సెంటర్లు 10 కి పైగా ఇటువంటి వి ఖమ్మం నగరములో ఉన్నాయి.జిల్లా వ్యాపాతంగా వీరి సంఖ్య వందల్లో ఉంది.

కొన్ని పరిశీలిస్తే

-,స్నేహ డయాజ్ఞటిక్ సెంటర్ ఖమ్మం వైరా రోడ్డులో చాలా కాలంగా ఉంది .బ్రాంచి ఒక దానిని బైపాస్ ఆర్టిఓ కార్యాలయం సమీపం లో ఏర్పాటు చేశారు..అక్కడ బ్లాక్ ఫంగస్ టెస్ట్ లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదే విషయము పై బ్రాంచి నిర్వహకులు. విజయ్ కుమార్ ని. టీమీడియా వివరణ అడిగింది. బ్రాంచి ఏర్పాటు అనుమతులు ఉన్నాయి అన్నారు ఇక్కడ పరీక్షలు చేసి రిపోర్ట్ తయారు చేసి వైరారోడ్ లోని మెయిన్ బ్రాంచ్ లో ఉండే డాక్టర్ గారి అప్రూవల్ తీసుకొంటామన్నారు

-పాత బస్టాండ్ వద్ద మెయిన్ బ్రాంచి ఉన్న “దివ్య” డయజ్ఞటిక్ సెంటర్ వారు ముస్తాఫానగర్ బ్రాంచి పెట్టారు. అక్కడ పరికరాలు లేవు.అక్కడ సేకరణ అన్నారు.మెయిన్ బ్రాంచి లోని డాక్టర్ వాసుదేవ్ గారి పేరు అక్కడి బోర్డు పై ఉంది.అక్కడ స్నేహ లాగా ఆన్లైన్ అప్రూవల్ తీసుకొంటున్నారు. నగరం లో. ఇటువంటి అప్రూవల్ పేరుతో డిజిటల్ సంత కాలతో రిపోర్టులు ఇచ్చే కేంద్రాలు కొంతమంది డాక్టర్లు,ఆస్పత్రులు అనుబంధంగా అనధికారికంగా ఉన్నాయి.వైద్యం మాఫియా లో కొత్తరూపం అయిన వీరిపై అధికారులు దృష్టి పెట్టాలి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.