తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వాతావరణ సూచన మరియు హెచ్చరికలు: ………………………

0
TMedia (Telugu News) :

నిన్న ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి ఈ రోజు ఒడిస్సా,పశ్చిమ బెంగాల్ తీరంలోని వాయువ్య బంగాళాఖాతం ప్రాంతములో కొనసాగుతుంది .

ఈ అల్పపీడనం కి అనుభందంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 5.8 కి మీ ఎత్తు వరకు కొనసాగుతుంది. .

—————-

వాతావరణ సూచన: (Weather Forecast):

s s consultancy

*ఈ రోజు రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షములు అనేక ప్రదేశములలో రేపు చాలా ప్రదేశములలో మరియు ఎల్లుండి కొన్ని ప్రదేశములలో వచ్చే అవకాశములు వున్నవి.

వాతావరణ హెచ్చరికలు:(weather warnings):

*ఈ రోజు భారీ నుండి అతి భారీ వర్షములతో పాటు అత్యంత భారీ వర్షములు మరియు రేపు భారీ వర్షములు ఒకటి రెండు ప్రదేశములలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

*ఈ రోజు అతి భారీ వర్షాలు మరియు అత్యంత భారీ వర్షములు ఉత్తర తెలంగాణా జిల్లాలలో ఒకటి, రెండు ప్రదేశములలో వచ్చే అవకాశాలు ఉన్నవి.

రాగల 2 రోజులు ఉరుములు , మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం 30 నుండి 40 కి మీ)తో కూడిన వర్షములు రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఒకటి, రెండు ప్రదేశములలో వచ్చే అవకాశములు వున్నవి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.