టెక్ హోమ్ రేషన్ పంపిణీ..సంక్షేమ అధికారి డాక్టర్ బి.నరేష్

0
TMedia (Telugu News) :
s s consultancy

టెక్ హోమ్ రేషన్ పంపిణీ
జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ బి.నరేష్
టీ మీడియా ప్రతినిధి ;జగిత్యాల జిల్లా;
కొడిమ్యాల( మే 18 )
కొడిమ్యాల మండలంలో గల అన్ని గ్రామాలలో ఐసిడిఎస్ ద్వారా అందించే టి.హెచ్,ఆర్ (టేక్ హోమ్ రేషన్)పథకంలో భాగంగా లబ్ధిదారులకు గ్రామ పాలక వర్గం (సర్పంచ్, ఎంపిటిసి, వార్డు సభ్యుల) సమక్షంలో కోవిడ్ -19 నిభంధనలలో నిత్యావసర సరుకులు (బియ్యం, పప్పు, నూనే, గుడ్లు, పాలు, కుర్ కురే, బాలామృతం) పంపిణీ చేయడం జరిగింది.
అలాగే మహిళ, పిల్లలు, వికలాంగులు మరియు వయోవృధుల సంక్షేమ శాఖ అందించే టోల్ ఫ్రీ నంబరు సౌకర్యం అందరు ఉపయోగించుకోవాలని, ఈ కోవిడ్ సమయంలో చాలా అవసరం ఉంటుందని జగిత్యాల జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ బీ నరేష్,మల్యాల సిడిపిఓ నర్సింగ రాణీ మంగళవారం తెలియజేసారు.
పిల్లలకు: 040-23733665
ఎవరైనా చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు కోవిడ్ పాజిటీవ్ వచ్చినట్లైతే పైన తెలిపిన ఫోన్ నంబర్ కు కాల్ చేసినచో వారి పిల్లలకు భోజనం, వసతులు అలాగే ప్రతి రోజు తల్లి దుండ్రులతో వీడియో కాల్ మాట్లాడే అవకాశం కల్పిస్తారని తెలియజేసారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇలాంటి పిల్లలను చూసుకోవడానికి సెంటర్లను, అందులో వసతులను ఏర్పాటు చేయడమైనది.
మహిళల కోసం…181
మహిళలు ఎలాంటి సమస్యలు ఉన్న (ముఖ్యంగా కొవిడ్ సమయంలో) 181 నంబరుకు ఫోన్ చేయవచ్చు.
వయోవృధులు : 14567
వయోవృధులకు ఎలాంటి సహాయమైన, సమస్యలకైన కొవిడ్ సమయంలో సలహాలకైన 14567 నంబరును ఉపయోగించవచ్చు.
వికలాంగులకు 1800-572-8980
వికలాంగులకు కొవిడ్ సమయంలో ఎలాంటి సమస్యలకైన, ఇబ్బందులకైన, సలహాలకైన ఈ నంబరు ఉపయోగించవచ్చు.
కావున మహిళలకు (181), పిల్లలకు (040 23733665), వికలాంగులకు ( 1800 – 572 – 8980) మరియు మయోవృధులకు (14567) వారి సంక్షేమానికి ఈ నంబర్లకు ఫోన్ చెయ్యగలరు. కొవిడ్ సమయంలో తప్పకుండా ఉపయోగించుకోవాలని, అలాగే అందరు సహకరించి గ్రామ స్థాయిలో ప్రజలకు ఈ విషయాలని తెలియ జేయలన్నారు.ఈ కార్యక్రమాలలో సర్పంచులు
,ఎంపిటిసిలు,ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీలత పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.