కొనుగోలు కేంద్రంలోదొంగలు పడ్డారు

0
TMedia (Telugu News) :

కొనుగోలు కేంద్రంలోదొంగలు పడ్డారు

రైతుల వడ్లు,వడ్ల బస్తాలు, విద్యుత్ వైర్, బల్బులు చోరీ…

s s consultancy

ప్రజా ప్రతినిధులు పూజ చేసి జోకిన మొదటి బస్తాను కూడా మాయం చేసిన దొంగలు

ప రైతుల ఆవేదన

మీడియా ప్రతినిధి,జగిత్యాల జిల్లా,మే 29

జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని పిఎసిఎస్ వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో దొంగలు పడ్డారు.పలువురు రైతులకు చెందిన వరిధాన్యం కుప్పల నుండి వడ్లు, కొందరి వడ్ల బస్తాలు, రాత్రి పూట వెలుతురు కొరకు ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్, బల్బులు చోరీకి గురైన సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.గత నెల ఏప్రిల్ 14 న ధర్మపురి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఈ వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు.ప్రజా ప్రతినిధులు పూజ చేసి ఎంతో ఆర్భాటంగా జోకిన మొట్ట మొదటి బస్తాను కూడా దొంగలు ఎత్తుకెళ్లినట్లు బుగ్గారం రైతులు ఆరోపిస్తున్నారు.పలువురు రైతులు తమ తమ పంట పొలాల్లో కోసిన వరి పంటను కొనుగోలు కేంద్రానికి తరలించి ధాన్యాన్ని ఆరబెట్టారు.ఈ క్రమంలోనే కొందరు దొంగలు జోకిన బస్తాలను,రైతుల వడ్ల కుప్పలలోని ధాన్యాన్ని, రైతులకు,హమాలీలకు రాత్రి పూట వెలుతురు ఉండేలా అమర్చిన సుమారు 400 మీటర్ల విద్యుత్ వైరు,బల్బులు కూడా దొంగల పాలు అయ్యాయి.ఆరబెట్టిన ధాన్యం నుండి,రాసులుగా రైతులు పోసిన వడ్ల కుప్పల నుండి వరిధాన్యం దొంగల పాలు అవడం పట్ల పలువురు బాధిత రైతులు,వారి తోటి రైతులు, మహిళా రైతులు చీవాట్లు పెడుతున్నారు.ఇంత జరిగినా ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న నిర్వహకులైన ధర్మపురి పిఎసిఎస్ అధికారులు గానీ, సిబ్బంది గానీ పోలీసులకు పిర్యాదు చేయకపోవడం పట్ల రైతుల్లో అనేక అనుమానాలు కలుగుతున్నాయి.
పిర్యాదు చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటని రైతులు మండిపడుతున్నారు.ఒక వైపు బస్టాకు 2 నుండి 3 కిలోల అదనపు తూకంతోనే రైతులు క్వింటాలుకు 4, 5 కిలోలు నష్టపోతుంటే,మరో వైపు ఈ దొంగల బెడద,ఇంకో వైపు నత్తనడకన సాగుతున్న ధాన్యం కొనుగోళ్ల తో తీవ్ర నష్టాలకు,దోపిడీకి గురౌతున్నామని రైతులు వాపోతున్నారు.ధాన్యం దొంగ తనానికి గురైన బాధిత రైతులను మీరేందుకు పోలీసులకు పిర్యాదు చేయలేదని ఒక విలేఖరి ప్రశ్నించగా పిర్యాదు చేసి సాధించేది ఏముందని, దొంగలు అంతా నాయకుల పట్టే ఉన్నారని వాపోతున్నారు.నాయకులు ఉండగా పోలీసులు వారిని ఏమి చేస్తారని,పిర్యాదు చేసినా చర్యలు ఉండవని మాకు తెలుసాని,అందుకే మేము పిర్యాదు చేయలేదని పలువురు రైతులు వాపోయారు.సెంటర్ నిర్వాహకులకు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు, నిర్వాహకులు తగిన చర్యలు తీసుకొని దొంగలను పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,ఇక ముందు ఇలాంటివి జరుగకుండా చూసి రైతులను కాపాడాలని కోరుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.