ఆపదలో తోడుగా వైఎస్‌ఎస్‌ఆర్‌ టీమ్‌

0
TMedia (Telugu News) :

ఆపదలో తోడుగా వైఎస్‌ఎస్‌ఆర్‌ టీమ్‌

s s consultancy

టీమీడియా / జహీరాబాద్ (సంగారెడ్డి జిల్లా) : కరోనాతో కుటుంబ పెద్దను కోల్పోయి కష్టాలు పడుతున్నవారిని ఆదుకునేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్‌ షర్మిల ముందుకొచ్చారు. ‘ఆపదలో తోడుగా వైఎస్‌ఎస్‌ఆర్‌ టీమ్‌’ ద్వారా బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం అందిస్తున్నారు. ఇటీవల కరోనాతో మృతి చెందిన సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం గుడుపల్లి గ్రామానికి చెందిన గోపన్పల్లి సుందర్ కుటుంబానికి ‘ఆపదలో తోడుగా వైఎస్‌ఎస్‌ఆర్‌ టీమ్‌’ అండగా నిలిచింది. వైఎస్‌ షర్మిల ఆదేశాలతో షర్మిలమ్మ ముఖ్య అనుచరులు పిట్ట రాంరెడ్డి కోర్డినేషన్లో గోపన్పల్లి సుందర్ వారి భార్య సంధ్యరాణి కి ‘ఆపదలో తోడుగా వైఎస్‌ఎస్‌ఆర్‌ టీమ్‌’ సభ్యులు విజయ్ చందర్ ఆర్థికసాయాన్ని అందజేశారు.

ఇటీవల వైస్ షర్మిల మాట్లాడుతూ… తమ కుటుంబాలకు ఆర్థిక అండగా నిలిచే ఎంతోమంది ఈ కరోనా బారిన పడి చనిపోయారు. కుటుంబ పెద్దదిక్కు తండ్రి / భర్త / కొడుకును కరోనాకు కోల్పోయి కుటుంబాన్ని నెట్టలేక నిరాశ, నిస్పృహల తో కృంగిపోతున్న మహిళల బాధను కాస్తైనా పంచుకోవాలని కుటుంబానికి ఆధారమైన వాళ్ళు కరోనాకాటుకు బలైతే అధైర్య పడవద్దని, పరిస్థితులకు ఎదురు నిలబడాలని, జీవితాన్ని సాగించాలని మహిళలకు ఆపదలో తోడుగా ఉండడానికి ఒక హెల్ప్ లైన్ నంబర్ 040-48213268 ద్వారా పిలుపునివ్వడం జరిగింది. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవటంతో ప్రజల్లో విశేష స్పందన రావడంతో ఇచ్చిన మాట ప్రకారం కరోనా బాధితులకు అండగా నిలిచారు వైస్ షర్మిల.

వైఎస్‌ఎస్‌ఆర్‌ టీమ్‌ సభ్యులు విజయ్ చందర్ మాట్లాడుతూ “జనం ఉన్నది లేనిది అమ్ముకొని అప్పులు చేసి మరి కరోనా వైద్యానికి డబ్బుల కట్టలు కుమ్మరిస్తున్నారు. కరోనా దెబ్బకు.. ఉన్నోడు కూడా బీదోడు అయిపోతున్నారు. రెక్కాడితే డొక్కాడని జనం పరిస్థితి పెనం నుంచి పొయిలో పడ్డట్టున్నది కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ దయచేసి ఇప్పటికైనా కరోనాను ఆయుష్మాన్ భారత్ లో కాకుండా ఆరోగ్యశ్రీ లో చేర్చలని కోరారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ నియోజకవర్గం స్థానిక నాయకులు సతీష్, దత్తు రెడ్డి, అలిగి సుందర్ రాజు, డాక్టర్ అనిల్ కుమార్, తడ్కల్ రాహుల్ కుమార్, ఎం.రాజు, సి.ఎస్సాప్ప, అలిగి భాస్కర్, సి.అరుణ్ కుమార్, సి.దయానంద, సి.సంపత్, సి.రాములు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.