రాజకీయంగా పోటీ పడలేక నాపై తప్పుడు ఆరోపణలు

0
TMedia (Telugu News) :
s s consultancy

రాజకీయంగా పోటీ పడలేక నాపై తప్పుడు ఆరోపణలు

టి మీడియా వనపర్తి జిల్లా 12 జూన్ : వనపర్తి పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలోని తన చాంబర్ లో మాట్లాడుతూ రాజకీయంగా నా ఎదుగుదల ను చూసి ఓర్వలేక కొంత మంది నాయకులు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మున్సిపల్ వైస్ ఛైర్మన్ వాకిటి శ్రీధర్ అన్నారు. గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వైఎస్సార్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు రాజీవ్ గృహకల్పి కు 40 ఫీట్ల రోడ్డు కోసం అప్పుటి తాహసీదార్ తీర్మానం చేయడం జరిగిందని అన్నారు .అంతే కాకుండా అప్పుటో విపరీతంగా వరదలు వచ్చేనప్పుడు కుంట పూర్తిగా వరద నీటిలో నిండిపోయిందిని రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్న వారి ఇళ్లలో వరద నీరు చేరడం జరిగిది అన్నారు. దీంతో కుంట కట్టను అప్పుటీ నాయకులు తొలగించారు. అనే విషయం ప్రతి పౌరుడుకి తెలుసన్నారు. ఇన్ని సంవత్సరాల తరువాత కుంట లో ఏపుగా ముళ్ల చెట్లు పెరిగి విష పాములు దోమలు పందుల సంచారం అధికంగా ఉంటుందని గృహకల్పి లో నివాసం ఉంటున్న ప్రజల వినతి ప్రకారమే మున్సిపల్ జెసిబి సహాయం తో ముళ్ల చెట్లను తొలగించి శుభ్రం చేయించాను అన్నిఅయన అన్నారు. అంతే కాకుండా అక్కడ ప్రజలకు ఉపయోగకరంగా ఉండేందుకు పార్కు ఏర్పాటు చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని తెలిపారు. కానీ కొంతమంది నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ నన్ను అభాసుపాలు చేయాలని చూస్తున్నారని అన్నారు.తానేంటో పట్టణ ప్రజలకు తెలుసని 20 సంవత్సరాలుగా రాజకీయంగా ఒక మచ్చ లేకుండా ఉన్న తన పై తప్పుడు అరోపణలు చేస్తే,తన పేరును ఇంకోసారి ప్రస్తావిస్తే చట్టపరంగా ప్రాసిక్యూట్ చేస్తానని హెచ్చరించారు. ప్రభుత్వ భూములు ఎక్కడున్నా మంత్రి నిరంజన్ రెడ్డి సూచనల మేరకు ప్రజలకు ఉపయోగపడే అందుకే ఉపయోగిస్తాము తప్ప ఎక్కడ ఒక అడుగు కబ్జాకు గురికాని ఇవ్వమని అన్నారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ పై తప్పుడు ఆరోపణలు చేయడం తగదని మాజీ కౌన్సిలర్ తిరుమల్ అన్నారు. ప్రభుత్వ భూమిలో వెంచర్ వేసిన, అక్రమ నిర్మాణాలు చేపట్టిన అది కబ్జా అవుతుంది. తప్ప ప్రజలకు ఉపయోగపడేదుకు ముళ్ల చెట్లను తొలగిస్తే కబ్జా ఎలా ఆవుతుందని ఆయన ప్రశ్నించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.