తెలంగాణాకు ఆక్సీజన్ కాన్సన్‌ట్రేటర్లు.. స్వాగతం పలికిన కేటీఆర్, సీఎస్

0
TMedia (Telugu News) :

తెలంగాణాకు ఆక్సీజన్ కాన్సన్‌ట్రేటర్లు.. స్వాగతం పలికిన కేటీఆర్, సీఎస్
టి-మీడియా-హైదరాబాద్(మే-16):

s s consultancy

*హైదరాబాద్‌కు 5 విమానాల్లో ఆక్సీజన్ కాన్సన్‌ట్రేటర్లు రాక.
*స్వాగతం పలికిన మంత్రి కేటీఆర్, సీఎస్.
*గ్రీన్ కో గ్రూప్ చొరవ.

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, సీఎస్ సోమేష్‌ కుమార్‌ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ కాన్సన్‌ట్రేటర్లను అందుకున్నారు. గ్రీన్‌ కో కో-ఫౌండర్లు అనిల్‌ చలమలశెట్టి, మహేష్‌ కొల్లి సైతం ఈ కార్గో విమానాలను స్వాగతించారు.
హైదరాబాద్‌ కేంద్రంగా పని చేసే గ్రీన్‌కో గ్రూప్‌, అంతర్జాతీయ సరఫరా చైన్‌ నెట్‌వర్క్‌ను వినియోగించుకుని ఆక్సీజన్ కొరత తీర్చేందుకు కీలక పాత్ర పోషిస్తోంది. ఆక్సిజన్‌ను వీలైనంత త్వరగా దేశీయంగా పంపిణీ చేయడానికి తన వంతు ప్రయత్నాలనూ చేస్తోంది. దీనికోసం ఐదు కార్గో విమానాలలో తొలి కార్గో విమానం ఆదివారం హైదరాబాద్‌లో 200 భారీ మెడికల్‌ గ్రేడ్‌ ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లతో ల్యాండ్‌ అయింది. ఈ కాన్సన్‌ట్రేటర్లు నిమిషానికి 10 లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్నాయి. అత్యంత భయంకరమైన కోవిడ్‌-19 మహమ్మారి రెండో వేవ్‌తో పోరాడుతున్న భారతదేశానికి ఇవి తోడ్పాటు అందించనున్నాయి.
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, సీఎస్ సోమేష్‌ కుమార్‌ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ కాన్సన్‌ట్రేటర్లను అందుకున్నారు. గ్రీన్‌ కో కో-ఫౌండర్లు అనిల్‌ చలమలశెట్టి, మహేష్‌ కొల్లి సైతం ఈ కార్గో విమానాలను స్వాగతించారు. కేటీఆర్ మాట్లాడుతూ ‘‘ప్రభుత్వ పరంగా మాత్రమే గాక వ్యాపార వేత్తలు, బాధ్యతాయుతమైన పౌరులు ఈ సమావేశంలో రోగులకు తగిన రీతిలో సాయం అందించడం తొలి ప్రాధాన్యతగా ఉండాలని. ఈ ఆక్సిజన్‌ సంక్షోభాన్ని సాధ్యమైనంత వరకూ తొలగించేందుకు ప్రయత్నించాల్సిన అవసరం ఇంకా ఉందని ఈ ప్రయత్నాలలో తమకు తోడ్పడిన గ్రీన్‌కో గ్రూప్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం’’ అని అన్నారు.
ఈ సందర్భంగా గ్రీన్‌కో గ్రూప్‌ ఎండీ అండ్‌ సీఈవో విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ ‘‘గత రెండు వారాలలో తామ అంతర్జాతీయ నెట్‌వర్క్‌ ద్వారా ఐదు కార్గో విమానాలలో తొలి బ్యాచ్‌ ఆక్సీజన్ కాన్సన్‌ట్రేటర్లను అందుకున్నామని” రాబోయే ఐదు రోజులలో మరో నాలుగు ఎయిర్‌క్రాఫ్ట్‌లు హైదరాబాద్‌, బెంగళూరు, న్యూఢిల్లీలలో 1000 భారీ మెడికల్‌ గ్రేడ్‌ ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లతో రానున్నాయని. ఇంకా తమ ద్వారా రాష్ట్రానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని వారు తెలియజేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.