తల్లి కుమారుడు ఆత్మహత్య

0
TMedia (Telugu News) :

తల్లి కుమారుడు ఆత్మహత్య

s s consultancy

టి-మీడియా (మే18) కర్నూలు జిల్లా శ్రీశైలం

మేకలబండ చెంచు కాలనీకి చెందిన శ్రావణి (26), శివతరున్ (18 నెలలు) తల్లి కుమారుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై హరిప్రసాద్ తెలిపారు. చెంచుకాలనీకి చెందిన నాగన్న (నాగులు) భార్య శ్రావణి మహానంది దగ్గర ఉన్న గాజులపల్లెకు బంధువులు వివాహానికి వెళ్ళి రెండు రోజుల క్రితం మోటర్ సైకిల్ పై శ్రావణి బంధువులతో శ్రీశైలం వచ్చిందన్నారు. ఎండలు అధికంగా ఉండడంతో శ్రావణి భర్త నాగన్న చిన్న పిల్లోడ్ని తీసుకొని ఎండలో రాకపోతే ఏమైందని మందలించడంతో మనస్థాపానికి గురై వలయ రహదారిలో ఉన్న దేవస్థానం గోశాల, రత్నానంద ఆశ్రమం సమీపంలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మంగళవారం సమాచారం తెలియడంతో సీఐ బి.వి. రమణ ఆధ్వర్యంలో సిబ్బంది, దేవస్థానం శానిటేషన్ సిబ్బందితో మృతదేహాలను భయటకు తీసి పోస్టుమార్టంకు తరళించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.