కరోన అనుమానంతో ఉరి వేసుకొని వృద్ధుడు మృతి

0
TMedia (Telugu News) :

కరోన అనుమానంతో ఉరి వేసుకొని వృద్ధుడు మృతి.

s s consultancy

టీ మీడియా ప్రతినిధి లక్షెట్టిపేట, మంచిర్యాల జిల్లా.

లక్షెట్టిపేట మండలం లోని కోత్తూర్ గ్రామానికి చెందిన ఆశీల శంకరయ్య 70 బుధవారం ఉదయం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మృతుడు గతంలో సింగరేణి రిటైర్ కార్మికుడని ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నారని తన భార్యకు కోవిడ్ పాజిటివ్ రావడంతో హోం క్వారంటైన్లో ఉంటుందని. ఈ క్రమంలోనే తన భార్య ఆరోగ్యం గూర్చి బాధపడుతూ తనకు కూడా పాజిటివ్ వచ్చిందేమోనని భయంతో ఆందోళన చెంది కోవిడ్ టెస్ట్ చేయించగా నేగటివ్ వచ్చిందన్నారు.అయినా కూడా ఆందోళనతో బుధవారం తెల్లవారుజామున ఇంటి వెనకాల ఉన్న చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడని,మృతునికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లు భార్య ఉన్నారని. భార్య ఆశీల శంకరమ్మ ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.