స్కూల్‌గ్రాంట్స్ నుంచి సబ్బులకు-డబ్బులు

0
TMedia (Telugu News) :
s s consultancy

స్కూల్‌గ్రాంట్స్ నుంచి సబ్బులకు-డబ్బులు.
టీ మీడియా హైదరాబాద్ బ్యూరో జూన్ 21.
పాఠశాలల్లో విధ్యార్థుల అవసరాలకు, చేతులు శుభ్రపరుచుకోవడానికి అవసరమైన సబ్బులు, లిక్విడ్‌ కొనుగోలుకోసం స్కూల్‌గ్రాంట్స్ నిధుల నుంచి 10శాతం కేటాఇంచినట్లు సమాచారం. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సమగ్రశిక్షా అభియాన్‌ అధికారులు వార్షిక కాంపోజిట్‌ గ్రాంట్‌ నిధులను మంజూరుచేశారు. విద్యార్థుల హాజరు నమోదు ఆధారంగా స్లాబులు నిర్ధారించి నిధులు కేటాయించారు. పరిశుభ్రతతోపాటు స్వచ్ఛత యాక్షన్‌ప్లాన్‌ లో భాగంగా మరుగుదొడ్ల వద్ద సబ్బులు, శుభ్రతద్రవాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 1నుంచి 15 మంది విద్యార్థులకు రూ.12,500, 16-100 మంది విద్యార్థులకు రూ.25వేలు, 101 -250 మంది వరకు రూ.50వేలు, 251-1,000 మంది వరకు 75వేలు, వెయ్యి మందికి మించి విద్యార్థులున్న పాఠశాలలకు రూ.లక్ష చొప్పున నిధులను కేటాయించారు. ఈ నిధులను స్టేషనరీ,చాక్‌పీస్‌లు, రిజిస్టర్లు, పరీక్షలు, జాతీయ పండుగల నిర్వహణ, విద్యుత్తు, అంతర్జాల నిర్వహణ చార్జీలు,పాఠశాల ప్రాధమిక మరమ్మతులకు వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.