ప్రకృతివనాన్ని తలపిస్తున్న వైకంఠ దామం ..అభినందించిన ఆర్డీవో

0
TMedia (Telugu News) :

ప్రకృతివనాన్ని తలపిస్తున్న వైకంఠ దామం

s s consultancy

సర్పంచ్ ని అభినందించిన ఆర్డీవో

టీ–మీడియా ప్రతినిధి ( మే 19) జగిత్యాల జిల్లా:

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని బతికేపల్లి గ్రామం వైకుంఠధామంలో పెరుగుతున్న వివిధ రకాల చెట్లు,పూల చెట్లు పార్కును తలపించేలా ఉంది.స్థానిక సర్పంచ్ తాటిపర్తి శోభారాణి ప్రత్యేక చొరవతో మొక్కలు నాటడంతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ప్రభుత్వ భూములు దూరంగా ఉండటంతో పాటు దహన సంస్కారాలు పూర్తి చేయాలంటే ప్రజలు అవస్థలు పడుతుండటంతో సర్పంచ్ గ్రామ ప్రజల సహకారంతోకి దగ్గర్లోనే విరాళాలతో భూమిని కొనుగోలు చేశారు.ఆ భూమిలోనే ప్రభుత్వం నుంచి మంజూరైన నిధులతో వైకుంఠ దామం నిర్మాణ పనులు ప్రారంభించారు. అందుబాటులోకి తీసుకువచ్చారు.ఒకప్పుడు శ్మశానవాటిక అంటే ప్రజలు భయానికి లోనయ్యేవారు.అక్కడి వాతావరణం అలా ఉండేది కానీ,ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయాయి.వైకుంఠదామం అంటే జనాలకు భయంపోయి అక్కడ పెరుగుతున్న రకరకాల చెట్లను చూస్తే పార్కును తలపించే విధంగా ఉందని చర్చించుకుంటున్నాచుట్టూ మొక్కలు నాటారు.దహన సంస్కారాల కోసం వచ్చినవారి కోసం షెడ్ నిర్మాణం,స్నానాల గదులు,షవర్లుతో పాటు తదితర సౌకర్యాలు కల్పించడమే కాకుండా,పార్కుకు తగినట్టుగా భూమిని చదును చేయించి పార్కులగాతీర్చిదిద్దారుపెరిగి .జగిత్యాల ఆర్డీవో మాధురి పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి కలియ తిరిగి నిత్యం చెట్లకు నీరు పోయడం,వాటిని కంటికి రెప్పలా కాపాడటాన్ని చూసి సర్పంచ్ శోభారాణిని అభినందించారు.గ్రామంలో సిమెంట్ రోడ్లు,హైమాస్ లైట్లు,పాడైపోయిన కరెంట్ స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు,విద్య,వైద్యంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తస్తున్నారు.కరోనా క్లిష్ట పరిస్థితుల నుంచి బయట పడటానికి గ్రామంలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయడమే కాకుండా కరోనా రోగుల ఇండ్లలోకి వైద్య సిబ్బందితో వెళ్లి ధైర్యం చెప్పుతూ నేనున్నానని భరోసా ఇస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.