టీచర్‌ సజీవ దహనం

0
TMedia (Telugu News) :

టీమీడియా: హైదరాబాద్‌ మే24;

వనస్థలిపురం ఎఫ్‌సీఐ కాలనీలో అగ్నిప్రమాదం జరిగింది. ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఓ మహిళ సజీవ దహనమైంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎఫ్‌సీఐ కాలనీలో నివాసముంటున్న బాలకృష్ణ, సరస్వతి (42) దంపతులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో భర్త బాలకృష్ణ తన ఇద్దరు పిల్లలను బయటకు తీసుకొచ్చి తిరిగి తన భార్య సరస్వతిని కాపాడేందుకు లోపలికి వెళ్లారు.

s s consultancy

అప్పటికే సరస్వతికి మంటలు అంటుకుని శరీరమంతా వ్యాపించాయి. ఆమె అక్కడే చిక్కుకుని సజీవ దహనమైంది. భార్యను కాపాడే క్రమంలో బాలకృష్ణకూ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే  సంఘటనా స్థలానికి అగ్ని మాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపుచేశారు. పోస్టుమార్టం నిమిత్తం సరస్వతి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. భర్తను ఎల్బీ నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.