సిలింగ్ భూమి పదిలం :రికార్డు లే మారాయి:విలువ రు40 కోట్లు

0
TMedia (Telugu News) :

సిలింగ్ భూమి పదిలం :రికార్డు లే మారాయి:విలువ రు40 కోట్లు

(టీమీడియా -నిఘావిభాగం)

భూమి తెలంగాణ లో కేసీఆర్ ప్రభుత్వ చర్యలు తో విలువ పెరిగింది..అందరి నోటా అస్థి కాకుండాభూమి ఉందా మీకు అన్న చర్చ పెరిగింది.మాగాణి,మెట్ట అన్న మాట మరిచారు.

s s consultancy
పై అవకాశాన్ని అంది పుచ్చుకొన్నారు ఖమ్మం రెవిన్యూ డివిజన్ పరిధిలో ని  కొంతమంది భూ "బకాసురులు"  .కోట్లు విలువ చేసే భూములు వివరాలు కేసీఆర్ చేయించిన భూరికార్డులు  ప్రక్షాళన. వినియోగించుకొని మార్పులు చేయించారు..దళారులు బైలు దేరి బై నెంబర్లు వేసి సిలింగ్ ల్యాండుఅనే పదం లేకుండా చేశారు.ఇక అసైన్డ్ గురించి చెప్పనవసరం లేదు..అడ్డం గా అమ్మి వేసి కోట్లు వెనుక వేసుకున్నారు.

పక్కసమాచారం అందుకున్న టిమీడియా టీము రంగం లోకి దిగి ఖమ్మం రెవిన్యూ డివిజన్ లో ఒక రెవిన్యూ గ్రామము లోని ఒక సర్వే నెంబర్ పై కేస్ స్టడీ చేసింది.అధికారం లో ఏపార్టీ ఉంటే ఆ పార్టి ,అందులోని ముఖ్యమైన ప్రజాప్రతినిధులు పంచన చేరడం .దళారి వ్యవహారం లో దిట్ట గా పేరున్న.ఒక మాజీ ప్రజాప్రతినిధి.ప్రస్తుత ప్రజా ప్రతినిధి కీలక పాత్ర ద్వారా ప్రస్తుతం ఓకే సర్వే నెంబర్ లోని 20 ఎకరాలు సిలింగ్ ల్యాండ్ రికార్డులు తారు మారు చేసి. అందులో కొంత విక్రయం చేసి నట్లు వెల్లడి అయింది.అదే సర్వే నెంబర్ లో ఉన్న ఆర్ అండ్ బి రోడ్డు కూడా రికార్డుల్లో తుడిపి వేసి దాని స్థానం లో సిలింగ్ ల్యాండ్ కు అసలు నెంబరుకు బై నెబర్లు వేసి విక్రయం చేశారు 1969 నుండి 2010 వరకు ఉన్న రెవిన్యూ రికార్డుల్లో ఆ సర్వే నెంబర్ లో కేవలం 16 ఎకరాలు మాత్రమే ఉంది ప్రస్తుతం 21 ఎకరాలుఅంటే 5 ఎకరాలు రికార్డు ల్లో అదనం గా చూపిస్తోంది.ఇదే సర్వే నెంబర్ లో సిలింగ్ కాకుండా రెవిన్యూ కోర్ట్ వివాదం లో 1965 లో పుట్టిన వ్యక్తి 1965 లో పుట్టినట్ల సృష్టించి నసాధా బైనామ కేసు 10 ఏళ్ల నుండి రేవిన్యూ కోర్టులో పెండింగ్ లో ఉంది.అందుకు సంధించిన 1ఎకరం 10 కుంటల కు ఆరోపణలు ఉన్న వ్యక్తి పెరు ఆన్లైన్ లో ఉంది.ఈ విధంగా అనేక అక్రమాలు ఒక్క సర్వే నెంబర్ పై కనిపించాయి.. 1960 లో అసలు నేను పుట్టలేదు .నా సంతకం ఫోర్జరీ చేశారు అని అన్ని ఆధారాలతో ఒక వ్యక్తి 8 ఏళ్ల క్రితం పోలీస్ కి,రెవిన్యూ కి ఇచ్చిన దరకాస్తులు నకళ్ళు,స్టేట్ మెంట్లు,1996 లోనే సిలింగ్ ల్యాండు స్వాధీనం చేసుకున్న ట్లు ఆనాటి రెవిన్యూ అధికారులు సంత కాలతో కూడిన డాక్యుమెంట్లు టీమీడియా సేకరించింది.అదే రేవిన్యూ లో సుమారు 200 ల కోట్లు భూ మాయ జరిగినట్లు గుర్తించడం జరిగింది..ఈ మాయ లో నాటి రెవిన్యూ అధికారు లు తో పాటు.మాజీ ప్రజాప్రతినిది కీలక పాత్ర ఉన్నట్లు తెలిసింది..అతను అణతి కాలంలోనే కోట్లకు పడగెత్తడం వెనుక భూమాయ అనేది స్పష్టం అవుతోంది.(మరికొన్ని వివరాలు మరో ఎపిసోడ్ లో)

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.