2013 లో సిలింగ్ ల్యాండ్ని ఆర్డీవోకి నివేదిక;2014 లోబైటపడిన దొంగ పుస్తకాలు

0
TMedia (Telugu News) :

2013 లోను సిలింగ్ ల్యాండ్ ఉందని ఆర్డీవోకి నివేదిక;2014 లోబైటపడిన దొంగ పుస్తకాలు
— —
ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం జీళ్ళచేరువు లోని సిలింగ్ భూమి రికార్డులు తారుమారు చేసి విక్రయాలు చేసిన వైనం లో ఒక్కొక్కటి నిజాలు బైట పడుతున్నాయి.2013 లో అప్పటి కుసుమంచి తహసీల్దార్ శ్రీలత జీళ్ళచేరువు సిలింగ్ భూమి. ప్రత్యేకించి 354 సర్వే నెంబర్ గురించి ఆర్డీవో కార్యాలయానికి పంపిన నివేదికలో సిలింగ్ భూమి ఉంది.అని సర్వే నెంబర్లు వారిగా నివేదికలో పొందు పర్చారు. అప్పటికే చాలా వరకు ఆ భూమి అన్యాక్రాంతం అయింది..అప్పటిశ్రీలత నివేదిక కాపీలు టీమీడియా సేకరించింది.సిలింగ్ భూమి పంచనామా సాక్షలు లో ఒకరైన అంబాల వీరభద్రం అనే వ్యక్తి 2014 లో తన సంతకం ఫోర్జరి చేసి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి సర్వే నెంబర్ 354 లో 1.04 ఎకరాలు దొంగ పాస్ బుక్ పొందారు అని అధికారులు కు పిర్యాదు చేసారు ఆ కాపీ సేకరించడము జరిగింది .2015 లోఇందుకు సంధించి ఖమ్మం ఆర్డీవో కోర్టులో కేసు నమోదు అయింది.7 ఏళ్ళు అయిన తెల లేదు.అప్పటి రెవిన్యూ అధికారులు..పట్టాదారవదినను (తల్లి సమాను సమాను రాలు)సర్వసభ్య సమాజం తల దించుకొనే విధంగా పట్టాదారు భార్యగా ప్రొసీడింగ్ ఫైల్ లో రాసారు.ఈ విషయం పైన పిర్యాదు లు ఉన్నాయి.అవి తేలలేదు.ఒక వైపు సాదా బైనామ లో పాస్ బుక్ పొందిన వ్యక్తి. 2004 లో పట్టాదారు సంతకం ఫోర్జరీ చేసి,పట్టాదారు ఫోటో అతికించి డాక్యుమెంట్ నెంబర్ 3225/04 ద్వారా కుసుమంచి రిజిస్టేషన్ కాయితాలు తీసుకున్నాడు. దీనిపైన అధికారులు వద్ 2014 లో కంప్లైంట్ రిజిస్టర్ అయింది. సిలింగ్ కేసులో ఉన్న ఆసర్వే నెంబర్ ప్రస్తుతం అసలు రెవిన్యూ రికార్డుల్లో కని పించక పోవడం అక్రమాలకు పరాకాష్ట గా ఉంది. ఇదే సిలింగ్ కేసులో ఉన్న భూమి ని కొనుగోలు చేసి ప్లాట్లు చేసి న అనంతరము వ్యవసాయే తర భూమిగా కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసినట్లు తెలిసింది..ఆ సర్వేనెంబర్ కోర్టు వివాదం లో ఉంది.కన్వర్షన్ కు అనుమతి ఇస్తారా అన్నది వేచి చూడాలి.ఇది ఇలా ఉంటే ఎటువంటి కన్వర్షన్ ,కనీసం పంచాయతి అనుమతి లేని భూమిలో ప్లాట్లు చేసిరాళ్ళు పాతిన పంచాయతి అధికారులు పట్టించుకోవడం వెనుక ఎవరు అన్నది తెలియాలి. మొత్తం మీద భూమి పదిలం..రికార్డులు తారుమారు అనేది స్పష్టంగా తెలుస్తుంది.

s s consultancy
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.