.ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ ముఖ్యం

0
TMedia (Telugu News) :
s s consultancy

.ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ ముఖ్యం..
కొడిమ్యాల ఎస్ఐ ఎం. మహేందర్
టీ మీడియా ప్రతినిధి; జగిత్యాల జిల్లా
కొడిమ్యాల (మే 11)
కొడిమ్యాల మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇటీవలి కాలం లో కొడిమ్యాల నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన
ఎం.మహేందర్ మంగళవారం రోజు పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో ఎస్సై మహేందర్ మాట్లాడుతూ కోవిడ్ 19 నియంత్రణలో పోలీసులకు ప్రజలు సహకరించాలని ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించి కోవిడ్ నిబంధనలు పాటించాలని, కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు కూడా బయట తిరుగుతున్నారని మా దృష్టికి వచ్చిందని తెలిపారు .కరోనా పాజిటివ్ వచ్చిన వారు హోమ్ ఐసోలేషన్ లోనే ఉండాలని ఏమైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని తెలిపారు. వ్యాపారస్తులు నిర్ణయించిన సమయం ప్రకారము వ్యాపారాలు నిర్వహించాలని తెలిపారు మోటార్ చట్టాన్ని అనుసరించి త్రిబుల్ డ్రైవింగ్, హెల్మెట్ లేని ప్రయాణం, మద్యపానము సేవించి వాహనాన్ని నడపడం,స్పీడ్ డ్రైవింగ్ మొదలగు వాటిపై కఠినంగా వ్యవహరిస్తామని అదేవిధంగా మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. భూమి విషయంలో తగాదాలు ఉంటే పోలీస్ స్టేషన్ కు రాకూడదని కోర్టులో తేల్చుకోవాలని ప్రజలకు తెలిపారు. సీసీ కెమెరాలు లేని మండలం చివరి గ్రామాలలో ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఒక్కొక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని సీసీ కెమెరాలు నేరాలు నియంత్రించడంలో చాలా ఉపయోగపడతాయని తెలిపారు. మండలంలోని ప్రజలను ప్రశాంతంగా ఉంచి శాంతిభద్రతల పరిరక్షణ కోసమే విధులు నిర్వహిస్తామని ఈ విషయాలను అర్థం చేసుకొని ప్రజలు మాకు సహకరించాల్సిందిగా కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.