సానిటైజె షన్ చేస్తున్న పంచాయితీ సిబ్బంది….

0
TMedia (Telugu News) :
s s consultancy

కరోన మహమ్మరితో హడలి పోతున్న గ్రామాలు..ఇంటిటీంటి కి సానిటైజె షన్ చేస్తున్న గ్రామ పంచాయితీ సిబ్బంది….

టీ మీడియా ప్రతినిధి నిజామాబాద్ జిల్లా/ముప్కాల్ :ముప్కాల్ మండలం లో ని నాగంపేట్ గ్రామంలో కరోన మహమ్మారి రోజు రోజుకి తీవ్ర రూపం దాలుస్తుండడం తో గ్రామ పంచాయితీ పాలక వర్గాలు అప్రమత్తం అవుతున్నాయి.. నాగాంపెట్ గ్రామ పంచాయితీ పరిధిలోని ,నాగంపేట్, ,గ్రామాల్లో ప్రతి ఇంటికి సోడియం హైడ్రో క్లోరైడ్ ద్రావణం తో సానిటైజేషన్ నిర్వహించాలన్న ఎంపీపీ సామ పద్మ వెంకట్ రెడ్డి సర్పంచ్ కాశిరెడ్డి రాజవ్వ ఆదేశాలతో పంచాయతీ కార్యదర్శి గౌతమి పంచాయితి కార్మికులతో ప్రతి ఇంటికి సానిటైజేషన్ చేయిస్తున్నారు..గ్రామం లో పలువురు కరోన బారిన పడడం తో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. పంచాయితి కార్యదర్శి గౌతమి దగ్గరుండి 9వార్డుల్లో నిత్యం సానీటైజేషన్ చేయిస్తున్నారు మొదట పాజిటివ్ నిర్దారణ ఆయిన ఇళ్ల వద్ద పూర్తి స్థాయి సానిటైజెషన్ నిర్వహించి అనంతరం కాలనీల్లో సానిటైజ్ చేస్తున్నారు..అయితే మండలం లో పలు గ్రామాల్లో కరోన మహమ్మరి తీవ్ర రూపం దాలుస్తుంది..ఇప్పటికే కరోన కాటుతో గ్రామాల్లో పదుల సంఖ్యలో మరణాలు నమోదు కావడం తో పరిస్థితులు ఒకింత చేజారుతున్నట్లు సమాచారం..మండల కేంద్రం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో గతం లో రోజుకు వంద నుండి రెండువందల కరోన పరీక్షలు నిర్వహించిన వైద్య సిబ్బంది ప్రస్తుతం కిట్ల కొరతతో రోజుకి 40 పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నట్లు హెల్త్ ఆఫీసర్ వివరించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాదం గణేష్ కారోబార్ వినోద్ ఆశాలు అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.