గుట్కాలు విక్రయిస్తే షీట్స్ ఓపెన్ చేస్తాం: ఏసీపీ ఉమెందర్.

0
TMedia (Telugu News) :
s s consultancy

గుట్కాలు విక్రయిస్తే షీట్స్ ఓపెన్ చేస్తాం: ఏసీపీ ఉమెందర్.
టి మీడియా//రామగుండం//పెద్దపల్లి జిల్లా,జూన్ 11
గోదావరిఖని 1టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్కా వ్యాపారం చేసే అటువంటి వారిని స్టేషన్కు పిలిపించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించి 23 మందిని బైండోవర్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఏసీపీ ఉమెందర్, సీఐ రమేష్ బాబు  మాట్లాడుతూ గుట్కా రవాణా,విక్రయాలపై తమకున్న సమాచారం మేరకు దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేయడం జరుగుతుందని ప్రభుత్వం నిషేధిత గుట్కా అక్రమ వ్యాపారం చేసేవారు వారి ప్రవర్తన మార్చుకో నట్లయితే వారిపై షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుందన్నారు.ఈ ప్రాంతంలో నిషేధిత “గుట్కా, అంబర్‌ ఖైనీ, ఫుల్‌ఛాప్‌”వంటి పొగాకు ఉత్పత్తులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. రామగుండం పోలీస్ కమీషనర్ వి సత్యనారాయణ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇప్పటికే పోలీసు దాడులను ముమ్మరం చేశాం. అనేక మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశాం.80 వేల రూపాయల విలువ చేసే పొగాకు ఉత్పత్తులను స్వాధీనం పర్చుకున్నాం.గుట్కా, ఖైనీ, పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉంది.ఈ విషయాన్ని వ్యాపారులు గ్రహించి నిషేధిత వ్యాపారాన్ని పూర్తిగా మానుకోవాలి. లేదంటే కఠిన చర్యలు తప్పవు అని  ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.బైండోవర్ చేసిన వారి వివరాలు:1. మాతంగి రాజు సంజయ్ నగర్,2.మహమ్మద్ అబ్బాస్ రామ్ నగర్,3.సద్దనపు శివకుమార్  ప్రశాంత్ నగర్,4. మోతిపాటి అనిల్ కుమార్  సీత నగర్,5.ఓలేటి ఆంజనేయులు శ్రీనగర్ కాలనీ,6. కలకోట వెంకటేశ్వర్లు ప్రశాంత్ నగర్,7.మామిడాల రామ్మూర్తి  శ్రీనగర్ కాలనీ, 8.కొల్లేటి శ్రీనివాస్ శ్రీనగర్ కాలనీ,9.గుంటి గోవర్ధన్ కాకతీయ నగర్,10. వెళగందుల నవీన్ కుమార్   జవహర్ నగర్, 11.రామిడి నవీన్ కుమార్ కళ్యాణ్ నగర్,12. పెట్టం రాములు మల్లికార్జున్ నగర్,13.చిదుర్ల అశోక్  మారుతి నగర్,14.ఆడెపు మహేందర్  విట్టల్ నగర్, 15. రవి రాజు మారుతి నగర్,16.ముత్యాల కిరణ్ కుమార్  కళ్యాణ్ నగర్,17.తోడుపునూరి చంద్రశేఖర్ లక్ష్మీ నగర్,
18.మట్టపర్తి శ్రీనివాసరావు  ఎన్టీఆర్ నగర్,19.ఉశికమల్లా నర్సింగరావు విట్టల్ నగర్,20.తలకోటి సాంబయ్య మార్కండేయ కాలనీ,21. పెండెం సదానందం మారుతి నగర్, 22.చదువు మహేందర్ రెడ్డి  శ్రీనగర్ కాలనీ

  1. పిట్టల సురేందర్ జవహర్ నగర్ పైన పేర్కొన్న వారిని శుక్రవారం ఎమ్మార్వో ముందు బైండోవర్ చేయడమైనది.
    ఈ కార్యక్రమంలో ఏసీపీ ఉమెందర్,1టౌన్ సీఐ రమేష్ బాబు 1టౌన్ 2వ సీఐ రాజ్ కుమార్ గౌడ్, ఎస్సై రమేష్ ఉన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.