మహేష్ సినిమా కోసం భారీ సెట్

0
TMedia (Telugu News) :
s s consultancy

మహేష్ సినిమా కోసం భారీ సెట్ ..?
సూపర్‌స్టార్ మహేష్ బాబు – త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. దీనికి భారీ సెట్ నిర్మాణం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు త్రివిక్రం తెరకెక్కించిన చాలా సినిమాలలో భారీ ఇంటి సెట్స్ ప్రధానంగా కనిపిస్తుంటాయి. ‘అత్తారింటికి దారేది’, ‘అజ్ఞాతవాసి’, ‘అల వైకుంఠపురములో’ కోసం ప్రత్యేకంగా వేసిన ఇంటి సెట్స్ గురించి అందరు మాట్లాడుకున్నారు. అలాంటి ఓ భారీ సెట్ ఇప్పుడు మహేష్ సినిమా కోసం రెడీ అవుతోందట. ఇంతక ముందు వీరిద్దరి కాంబినేషన్‌లో ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు తెరకెక్కబోతున్న హ్యాట్రిక్ సినిమా మీద బాగానే అంచనాలు మొదలయ్యాయి. పాన్ ఇండియన్ స్థాయిలో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని సమాచారం. ఇక మహేష్ పరశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.