లాక్ డౌన్ సమయంలో బయట తిరుగుతున్న వాహనాలు సీజ్

0
TMedia (Telugu News) :

లాక్ డౌన్ సమయంలో బయట తిరుగుతున్న వాహనాలు సీజ్

s s consultancy

టి-మీడియా గోదావరిఖని పెద్దపల్లి జిల్లా (మే 20)

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎఫ్ సి ఐ చౌరస్తా లో గోదావరిఖని ఏసీపీ ఉమెందర్ లాక్ డౌన్ సమయంలో బయట తిరుగుతున్నటువంటి వాహనలను ఆపి బయటికి రావడానికి గల కారణాలను అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ఏలాంటి కారణాలు లేకుండా బయటికి వచ్చిన 05 వాహనాలను సీజ్ చేయడం జరిగింది.పోలీస్ సిబ్బందికి ముఖ్య సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది.లాక్‌డౌన్‌ అమలు తీరు చక్కగా ఉందని ప్రజలు, వ్యాపారస్తులు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. అలాగే లాక్ డౌన్ ను కట్టుదిట్టం గా అమలు చేస్తున్నాం అన్నారు.కరోనా వ్యాధి ఎక్కువగా ఉన్నందు వలన కర్ఫ్యూ విధించడం జరిగిందని ప్రజలు ఎవరూ కూడా రోడ్లపైకి వచ్చి కరోనా బారిన పడకుండా లాక్ డౌన్ నియమాలు పాటించనట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తూ వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందన్నారు. ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు వహించి పోలీస్ వారికి సహకరించాలని కోరారు.
రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ కణతల లక్ష్మీనారాయణ, ఎస్ఐ స్వరూప్ రాజ్,పిఎస్ఐ రాజశేఖర్ సిబ్బంది ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.