ఎక్సెంచర్ ప్రాంగణ నియామకాలకు ఎస్.బి.ఐ. టి. విద్యార్థులు ఎంపిక

ఎక్సెంచర్ ప్రాంగణ నియామకాలకు ఎస్.బి.ఐ. టి. విద్యార్థులు ఎంపిక ప్రతిష్టాత్మకమైన ఎక్సెంచర్ కంపెనీలో ముగ్గురు ఎస్.బి.ఐ. టి.విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు కళాశాల చైర్మన్ గుండాల(ఆర్జేసీ)కృష్ణ తెలిపారు.

0
TMedia (Telugu News) :

ప్రతిష్టాత్మకమైన ఎక్సెంచర్ కంపెనీలో ముగ్గురు ఎస్.బి.ఐ. టి.విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు కళాశాల చైర్మన్ గుండాల(ఆర్జేసీ)కృష్ణ తెలిపారు.

వీరికి వార్షిక వేతనం 4.5 లక్షలు ఉంటుంది అని ఆయన తెలిపారు.ఈ మేరకు ఎంపిక అయిన విద్యార్థులను ఆయన చాంబర్ లో శుక్రవారం అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్ లైన్ లో ప్రాంగణ నియామకాల మెళుకువలను విద్యార్థులకు నేర్పించడం ద్వారా ప్రఖ్యాతి గాంచిన కంపెనీల్లో విద్యార్థులు ఉద్యోగాలు సంపాదించడం జరిగిందన్నారు.

s s consultancy

తమ కళాశాల నుండి ఏ.సాయి దివ్య,బి.భార్గవరాం,టి.రచనలు ఎంపిక అయినట్లు తెలిపారు.కాగా విద్యార్థులను పలువురు అధ్యాపకులు అభినందించారు.ఈ కార్యక్రమంలో కళాశాలసెక్రెటరీ, అండ్ కరస్పాండెంట్ గుండాల ధాత్రి, ప్రిన్సిపాల్ రాజ్ కుమార్,టి.పి.ఓ.సవిత,వైస్ ప్రిన్సిపాల్ జి.శ్రీనివాస్,పలువురుఅకడమిక్ డైరెక్టర్లు,హెచ్ ఓ డి లు తదితరులు పాల్గొన్నారు….

SBIT Students Got Placed In Accenture
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.