నిరుపేదల ఆకలి థిరుస్థున్న టి అర్ కె

0
TMedia (Telugu News) :

ఆపద సమయంలో అండగా ఉంటాం నిరుపేదల ఆకలి థిరుస్థున్న టి అర్ కె

టి మీడియా ప్రతినిధి,రాజన్న సిరిసిల్లా జిల్లా,వేములవాడ,(మే 17):

ఆపద సమయంలో అండగా ఉంటామని… మరోసారి నిరూపించుకుంటున్నారు సహృదయులు తోట రామ్ కుమార్

s s consultancy

కరోనా మహమ్మారి రెండవ సారి ప్రజలపై ఊహించని ఈ విధంగా దాడి చేస్తూ ప్రాణాలను హరిస్తుంది… ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కరోనా ను కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించింది.

మూడవరోజు సోమవారం వేములవాడ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉండే వలస జీవులకు, కూలీలకు, ఆలయ పరిసర ప్రాంతాల్లో బిక్షాటన చేసేవారికి టి ఆర్ కె ట్రస్ట్ సభ్యులు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా టి.ఆర్.కె ట్రస్ట్ డైరెక్టర్ మొట్టల మహేష్ కుమార్ మాట్లాడుతూ లాక్ డౌన్ పూర్తయ్యేవరకు టి ఆర్ కె ట్రస్ట్ తరపున నిరుపేదలకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేస్తామని, ఆపద సమయంలో అండగా ఉండేందుకు తాము ముందు ఉంటామని అన్నారు. లాక్ డౌన్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ట్రస్టు తరపున పేదలకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తామని తెలిపారు.
అనంతరం టి.ఆర్.కె ట్రస్ట్ ప్రతినిధులు ముప్పిడి శ్రీధర్, రాకేష్ మాట్లాడుతూ

లాక్ డౌన్ సమయంలో ఎందరో నిరుపేదలు తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారనే విషయం తెలుసుకొని టి ఆర్ కె ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ ముందుకు వచ్చి నిరుపేదల ఆకలిని తీర్చడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నిరుపేదలకు ట్రస్ట్ సేవలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టి ఆర్ కె వర్కింగ్ టీం, ఎంక్వయిరీ టీం సభ్యులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.