జ్వరం సర్వే కి ప్రజలు సహకరించగలరు….సర్పంచ్ కోట విజయశాంతి

0
TMedia (Telugu News) :
s s consultancy

జ్వరం సర్వే కి ప్రజలు సహకరించగలరు….సర్పంచ్ కోట విజయశాంతి

టీ మీడియా,ఏప్రిల్ 10,మధిర: జిల్లాకలెక్టర్, జిల్లా వైద్యాధికారి,జిల్లా పంచాయతీ అధికారుల ఆదేశాల మేరకు గత నాలుగు రోజులు నుండి గ్రామల్లో నడుస్తున్న కోవిడ్ ఫీవర్ ఇంటింటా సర్వే లో భాగంగా మధిర మండలం దెందుకూరు ప్రాథమిక వైద్యశాల వైద్య అధికారిణి డాక్టర్ పుష్పలత, గ్రామ సర్పంచ్ కోట విజయశాంతి ఆధ్వర్యంలో పారామెడికల్ జి పి సిబ్బంది ఐ సి డి ఎస్ ఐకేపీ సిబ్బంది సమన్వయoతో దెందుకూరు బీసీ కాలనీ ఇంటింటా సర్వేని తనిఖీ చేసారు. ఈ సందర్బంగా సర్పంచ్ విజయశాంతి ,డాక్టర్ పుష్పలత మాట్లాడుతూ….. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్నది కనుక ప్రజలు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ముందుగా వైరస్ కంటే భయం, కంగారు వద్దు అని ప్రతి
ఒక్కరు జ్వరలక్ష ణాలు కనిపిస్తే వెంటనే ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలని ప్రతి ఒక్కరు ఇంటి పట్టునే ఉండాలని ఈనెలాఖరు వరకు ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్త గా ఉండాలి, అని ప్రజలకు ఇల్లు ఇల్లు తిరిగి తెలియపరిచినారు.అదే విధంగా కరోనా రూల్స్ అందరూ పాటించాలని సూచిoచారు. ఈ కార్యక్రమం లో హెల్త్ సూపర్ వైజర్ లంకా కొండయ్య, కాంతలీల, ఏఎన్ఎం రాజేశ్వరి జిపి సిబ్బంది దోర్నాల కృష్ణా ఆశ వర్కర్లు బేగం కళ్యాణి అంగన్వాడీ టీచర్ గుర్రం స్వరాజ్జ్య లక్ష్మి ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.