ఆరోగ్య నిర్దారణ వివరముల సేకరణ.

0
TMedia (Telugu News) :

కోహెడ గ్రామంలో ప్రజల ఆరోగ్య నిర్దారణ వివరముల సేకరణ.

s s consultancy

టి-మీడియా/కోహెడ(సిద్దిపేట జిల్లా)మే 07

సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో శుక్రవారం రోజున కోవిడ్-19 ఇంటింటి సర్వే కార్యక్రమం స్థానిక సర్పంచ్ పేర్యాల నవ్యదేవేందర్ రావు,సింగిల్ విండో చైర్మన్ పేర్యాల దేవేందర్ రావు,స్థానిక ఎంపీటీసీ ఖమ్మం స్వరూపవేంకటేశం,ఆశ వర్కర్లు,అంగన్వాడీ టీచర్లు,పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు.ఇంటింటికీ తిరిగిన సందర్భంగా కోవిడ్ సెకండ్ వే ఉధృతిని నివారించేందుకు ప్రజలు ఎవరికి వారు తగు జాగ్రత్తలు తీసుకొని వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించండి అత్యవసరం అనుకొంటేనే మాస్కులు ధరించి సానిటేజర్ తో బయటకు వెళ్లాలని సూచిస్తు ఇంట్లో ఎవరికైనా జ్వరం దగ్గు ఆయాసం అనిపించిన వెంటనే టెస్టులు చేయించుకొని డాక్టర్ సూచన మేరకు వైద్యం వెంటనే తీసుకోవాలని సూచించారు.అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలు ఇంటింటికి సర్వేకు వచ్చేవారికి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖదీర్ ఆశ వర్కర్ వెల్దండి కవిత,అంగన్వాడీ బొమ్మగాని తిరుమల,పంచాయితీ కార్యదర్శి రేగుల తిరుపతి, గ్రామస్తులు ఖమ్మం వేంకటేశం, జాలిగం శంకర్,గ్రామపంచాయతీ ఆఫీసు బాయ్ రజినీకాంత్ పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.